శ్రీలంకపై సునాయాసంగా ఆసీస్ విజయం

ABN , First Publish Date - 2021-10-29T05:08:05+05:30 IST

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సునాయాసంగా విజయం సాధించింది. తొలుత ఆసీస్ బౌలర్లు రాణించగా..

శ్రీలంకపై సునాయాసంగా ఆసీస్ విజయం

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సునాయాసంగా విజయం సాధించింది. తొలుత ఆసీస్ బౌలర్లు రాణించగా.. ఆ తర్వాత బ్యాట్స్‌మన్ అదరగొట్టి మ్యాచ్‌లో విజయం దక్కించుకున్నారు. టాస్ ఒడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఓపెనర్ కుశాల్ పెరీరా(35: 25 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్స్), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చరిత్ అసలంక((35: 27 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్స్)లతో పాటు మిడిలార్డర్‌లో భానుక రాజపక్స(33 నాటౌట్: 26 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్స్) గౌరవప్రదమైన స్కోర్లు చేశారు. దీంతో శ్రీలంక  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడం జంపా తలా 2 వికెట్లు తీసుకున్నారు.


అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్ డేవిడ్ వార్నర్(65: 42 బంతుల్లో 10 ఫోర్లు) అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. అతడికి మరో ఓపెనర్, జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్(37: 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహకరించాడు. చివర్లో స్టీవ్ స్మిత్(28 నాటౌట్: 26 బంతుల్లో 1 ఫోర్) మార్కస్ స్టోయినిస్(16 నాటౌట్: 7 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) ఆడుతూ పాడుతూ టార్గెట్ ఛేజ్ చేశారు. 3 వికెట్లు కోల్పోయి కేవలం 17 ఓవర్లలోనే 155 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ డిసిల్వా 2 వికెట్లు తీయగా, దాసున్ శనక ఓ వికెట్ తీసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అర్థసెంచరీతో అదరగొట్టిన ఆసీస్ ఓపెనర్ వార్నర్‌కు దక్కింది.

Updated Date - 2021-10-29T05:08:05+05:30 IST