బ్రిస్బేన్ టెస్ట్: ముగిసిన సుందర్ ఇన్నింగ్స్
ABN , First Publish Date - 2021-01-17T17:51:06+05:30 IST
అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించిన వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర స్టార్క్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
బ్రిస్బేన్: అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించిన వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర స్టార్క్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 9వ వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం క్రీజులో సిరాజ్, నటరాజన్ ఉన్నారు. అంతకు ముందు శార్దుల్ ఠాకూర్(67), సైని(5) స్వల్ప వ్యవధిలో అవుట్ అయ్యారు. కమిన్స్ బౌలింగ్‌లో శార్దుల్ బౌల్డ్ అవ్వగా, హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు సైని క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీమిండియా 109 ఓవర్లలో 328 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది.