ఐదో వికెట్.. రూట్ వికెట్ తీసిన అక్షర్
ABN , First Publish Date - 2021-02-25T23:22:58+05:30 IST
ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అవుటైపోయాడు. 19 పరుగులు స్కోరు వద్ద రూట్ అక్షర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 56 పరుగులకే ఇంగ్లండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. ఈ వికెట్‌తో అక్షర్ రెండో ఇన్నింగ్స్‌లో..
అహ్మదాబాద్: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అవుటైపోయాడు. 19 పరుగులు స్కోరు వద్ద రూట్ అక్షర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 56 పరుగులకే ఇంగ్లండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. ఈ వికెట్‌తో అక్షర్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే క్రాలీని గోల్డెన్ డక్‌గా పెవిలియన్ పంపిన అక్షర్.. అదే ఓవర్లో మూడో బంతికి బెయిర్ స్టోను కూడా పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత డామ్ సిబ్లీని కూడా ఎల్బీగా అవుట్ చేశాడు. ఇక నాలుగో వికెట్‌గా బెన్ స్టోక్స్‌ను అశ్విన్ అవుట్ చేయగా.. కీలకమైన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను అక్షర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌కు 25 పరుగుల ఆధిక్యం ఉంది.