అసలంక అదిరె..
ABN , First Publish Date - 2021-10-25T07:17:08+05:30 IST
ఆల్‌రౌండ్ షోతో శ్రీలంక జట్టు ప్రపంచ కప్‌లో శుభారంభం చేసింది..బంగ్లాదేశ్ సవాలు విసరగలిగే లక్ష్యాన్ని నిర్దేశించినా అసలంక, భనుక అర్ధ శతకాలతో చెలరేగడంతో ...

ఐదు వికెట్లతో బంగ్లాదేశ్‌పై గెలుపు
అసలంక, భనుక హాఫ్ సెంచరీలు
టీ20ల్లో పది వికెట్ల తేడాతో భారత్ ఓడడం ఇదే తొలిసారి
దేశం గర్విస్తోంది
పాక్ జట్టుకు శుభాకాంక్షలు. టీమ్‌ను ముందుండి నడిపించిన బాబర్ ఆజమ్‌తోపాటు రిజ్వాన్, షహీన్ షా అఫ్రీదికి ప్రత్యేకాభినందనలు. మీ విజయంతో దేశం యావత్తు గర్విస్తోంది.
- ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని
ప్లాన్ ప్రకారం ఆడాం
ప్రణాళికను కచ్చితంగా అమలు చేశాం. షహీన్ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. స్పిన్నర్లు కూడా ఆధిపత్యం చెలాయించారు. ఏమాత్రం తొందరపడకుండా ప్రశాంతంగా ఆడాలనేది మా ప్లాన్. 8వ ఓవర్‌నుంచి మంచు కురవడం ఆరంభం కావడంతో బంతి బ్యాట్‌పైకి చక్కగా వచ్చింది. గత రికార్డుల తాలూకు ఒత్తిడి మాపై లేదు.
- బాబర్ ఆజమ్
ఆల్‌రౌండ్ షోతో శ్రీలంక జట్టు ప్రపంచ కప్‌లో శుభారంభం చేసింది..బంగ్లాదేశ్ సవాలు విసరగలిగే లక్ష్యాన్ని నిర్దేశించినా అసలంక, భనుక అర్ధ శతకాలతో చెలరేగడంతో ఇంకా ఏడు బంతులుండగానే కేవలం ఐదు వికెట్లే కోల్పోయి ఛేదించింది..అయితే లిటన్ దాస్ అవుటైన సందర్భంగా జరిగిన గొడవ రెండు జట్ల మధ్య ఆవేశకావేశాలకు దారి తీసి అంపైర్లు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
షార్జా: యువ బ్యాటర్ చరిత్ అసలంక (49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 నాటౌట్), భనుక రాజపక్స (31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో మెరిసిన వేళ వరల్డ్ కప్‌లో శ్రీలంక బోణీ చేసింది. ఆదివారం జరిగిన గ్రూప్-1 సూప ర్-12 పోరులో ఐదు వికెట్లతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 171/4 స్కోరు చేసింది. మహ్మద్ నయీమ్ (52 బంతుల్లో 6 ఫోర్లతో 62), ముష్ఫికర్ రహీమ్ (37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 నాటౌట్) సత్తా చాటారు. కరుణ రత్నే, ఫెర్నాండో, కుమార తలా ఒక వికెట్ తీశారు. అనంతరం శ్రీలంక 18.5 ఓవర్లలో 172/5 స్కోరు చేసి గెలుపొందింది. అసలంక, భనుకతోపాటు నిస్సాంక (24) రాణించాడు. షకీబల్ (2/17) రెండు వికెట్లు పడగొట్టాడు. అసలంక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు.
వారిద్దరి షో: తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయునా ఆ తర్వాత పుంజుకోవడం..మళ్లీ మిడిలార్డర్ వైఫల్యంతో మూడు వరుస వికెట్లు చేజార్చుకొని ఇబ్బందుల్లో పడడం..ఈ దశలో అసలంక, భనుక ఆదుకోవడం..ఇదీ శ్రీలంక ఇన్నింగ్స్ తీరు. అలాగే వీరిద్దరు ఇచ్చిన క్యాచ్‌లను లిటన్ దాస్ నేలపాలు చేయడం ‘లయన్స్’ గెలుపు అకాశాలను దెబ్బకొట్టింది. నాలుగో బంతికే ఓపెనర్ కుశాల్ పెరీరా (1)ను బౌల్డ్ చేసిన స్పిన్నర్ నసుమ్ అహ్మద్ బంగ్లాకు అదిరే బ్రేకిచ్చాడు. కానీ 24 ఏళ్ల అసలంక..మసూద్ బౌలింగ్‌లో 6,6, హసన్ బౌలింగ్‌లో నిస్సాంక 4,6 కొట్టడంతో పవర్ ప్లే ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 54 రన్స్ చేసింది. 9వ ఓవర్లో నిస్సాంక, ఆవిష్క ఫెర్నాండో (0)లను షకీబల్, 10వ ఓవర్లో హసరంగ (6)ను సైఫుద్దీన్ అవుట్ చేయడంతో 79/4తో శ్రీలంక చిక్కుల్లో పడింది. అర్ధ శతకం పూర్తి చేసిన అసలంక..14వ ఓవర్లో మహ్మదుల్లా బౌలింగ్‌లో 6,6తో ఎదురు దాడికి దిగాడు. ఆఖరి ఐదు ఓవర్లలో 46 పరుగులు కావాల్సిన దశలో..16 ఓవర్లో రాజపక్స 6,6,4,4తో దుమ్మురేపడంతో శ్రీలంక 22 పరుగులు చేసింది. 19వ ఓవర్లో రాజపక్సే నిష్క్రమించినా జోరుమీదున్న అసలంక బౌండరీతో విజయాన్ని అందించాడు.
రాణించిన నయీమ్, ముష్ఫికర్: టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌ను ఓపెనర్ మహ్మద్ నయీమ్, ముష్ఫికర్ రహీమ్ అర్ధ శతకాలతో ఆదుకున్నారు. 56/2తో ఉన్న దశలో జత కలిసిన నయీమ్, ముష్ఫికర్ మూడో వికెట్‌కు 8.3 ఓవర్లలోనే 73 పరుగులు జత చేసి పరిస్థితి చక్కదిద్దారు. ఇక, బంగ్లా ఓపెనర్లు నయీమ్, లిటన్ దాస్ వీలుచిక్కినప్పుడే తప్ప భారీ షాట్ల జోలికి పోకుండా ఆచితూచి ఆడారు. పవర్ ప్లే ముగిసే సరికి 41/1తో ఉన్న ఆ జట్టు సగం ఓవర్లు ముగిసే సరికి 72/2తో నిలిచింది. ఇక హసరంగ వేసిన 15వ ఓవర్లో 4,4తో ముష్ఫికర్ కదం తొక్కడంతో ఈ జోడీ..ఐదు ఓవర్లలోనే 46 పరుగులు రాబట్టింది. 17వ ఓవర్లో నయీమ్ నిష్క్రమించగా..అఫిఫ్ హొసేన్ (7) రనౌట్ అయ్యాడు.
స్కోరుబోర్డు
బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్ (సి అండ్ బి) ఫెర్నాండో 62; లిటన్ దాస్ (సి) షనక (బి) లాహిరు కుమార 16; షకీబల్ (బి) కరుణరత్నే 10; ముష్ఫికర్ రహీమ్ (నాటౌట్) 57; హొస్సేన్ (రనౌట్/లాహిరు) 7; మహ్మదుల్లా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 171/4; వికెట్ల పతనం: 1-40, 2-56, 3-129, 4-150; బౌలింగ్: చమిక కరుణరత్నే 3-0-12-1; బినుర ఫెర్నాండో 3-0-27-1; దుష్మంత చమీర 4-0-41-0; లాహిరు కుమార 4-0-29-1; చరిత్ అసలంక 1-0-14-0; హసరంగ డిసిల్వా 3-0-29-0; దసున్ షనక 2-0-14-0.
శ్రీలంక: కుశాల్ పెరీర (బి) నసుమ్ అహ్మద్ 1; నిస్సాంక (బి) షకీబల్ 24; చరిత్ అసలంక (నాటౌట్) 80; అవిష్క ఫెర్నాండో (బి) షకీబల్ 0; హసరంగ డిసిల్వ (సి) నయీమ్ (బి) సైఫుద్దీన్ 6; భనుక రాజపక్స (బి) నసుమ్ అహ్మద్ 53; షనక (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 18.5 ఓవర్లలో 172/5; వికెట్ల పతనం: 1-2, 2-71, 3-71, 4-79, 5-165; బౌలింగ్: నసుమ్ అహ్మద్ 2.5-0-29-2; మెహ్దీ హసన్ 4-0-30-0; సైఫుద్దీన్ 3-0-38-1; షకీబల్ 3-0-17-2; ముస్తాఫిజుర్ 3-0-22-0; మహ్మదుల్లా 2-0-21-0; హొస్సేన్ 1-0-15-0.
షకీబల్ రికార్డ్
బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో పోరులో రెండు వికెట్లు పడగొట్టిన లెఫ్టామ్ స్పిన్నర్ షకీబల్ మొత్తం 29 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రీది (34 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు) రికార్డును తిరగరాశాడు. ఇక టీ20ల్లో అత్యధిక వికెట్ల పడగొట్టిన రికార్డు కూడా షకీబల్దే కావడం విశేషం.
రచ్చ..రచ్చ
ఆరో ఓవర్లో లిటన్ దాస్‌ను అవుట్ చేసిన కుమార..అతడి వద్దకు వెళ్లి మాటలతో కవ్వించాడు. దాంతో దాస్ కూడా దీటుగా బదులివ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి ఓ దశలో ఒకరినొకరు నెట్టుకొనే స్థాయికి వచ్చారు. నాన్స్ట్రయికర్వైపు ఉన్న బంగ్లా బ్యాట్స్‌మన్ నయీమ్ వారివద్దకు వచ్చి కుమారను వెనక్కు నెట్టాడు. దాంతో శ్రీలంక ప్లేయర్లు ఆగ్రహోదగ్రులు కావడంతో రెండు జట్ల ఆటగాళ్లు పరస్పరం తోసుకొని పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. అంపైర్లు జోక్యం చేసుకొని పరిస్థితి చక్కదిద్దాలని చూసినా శ్రీలంక, బంగ్లా క్రికెటర్లు వినలేదు. అయితే కొద్దిసేపటికి రెండు జట్ల ఆటగాళ్లు శాంతించారు.
