వామికకు ఆరు నెలలు.. ఫొటో పోస్టు చేసిన విరుష్క

ABN , First Publish Date - 2021-07-13T02:07:19+05:30 IST

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ-అనుష్కల గారాలపట్టి విరుష్క అప్పుడే ఆరో నెలలోకి ప్రవేశించింది.

వామికకు ఆరు నెలలు.. ఫొటో పోస్టు చేసిన విరుష్క

ముంబై: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ-అనుష్కల గారాలపట్టి వామిక అప్పుడే ఆరో నెలలోకి ప్రవేశించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను పోస్టు చేసింది. కుమార్తె తన ఒళ్లో ఉన్న ఫొటోను, వామికను ఎత్తుకున్న కోహ్లీ ఫొటోను పోస్టు చేసింది. అయితే, ఎప్పటిలానే ఈసారి కూడా చిన్నారి ముఖం కనిపించకుండా జాగ్రత్త తీసుకుంది.


‘ఆమె ఒక్క నవ్వు మా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చేసింది. నువ్వు మాపై చూపే ప్రేమతోనే మేం జీవించగలమని నమ్ముతున్నా. మన ముగ్గురికి ఆరు నెలల శుభాకాంక్షలు’ అని క్యాప్షన్ రాసిన ఈ ఫొటోకు ఇప్పటి వరకు దాదాపు 39 లక్షల లైకులు వచ్చాయి. వామిక ఈ ఏడాది జనవరిలో జన్మించింది.  

Updated Date - 2021-07-13T02:07:19+05:30 IST