మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్ర.. అక్షర్ కళ్లద్దాలతో ఫొటో!

ABN , First Publish Date - 2021-03-22T16:23:01+05:30 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర వృత్తి రీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు తగు సమయం కేటాయిస్తుంటారు.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్ర.. అక్షర్ కళ్లద్దాలతో ఫొటో!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర వృత్తి రీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు తగు సమయం కేటాయిస్తుంటారు. పలు సామాజిక అంశాలపై తన గళాన్ని వినిపిస్తుంటారు. అంతే కాదు క్రికెట్ గురించి కూడా ట్వీట్లు చేస్తుంటారు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో అక్షర్ పటేల్ పెట్టుకున్న కళ్లద్దాలు బాగున్నాయని, టెస్ట్ విజయాన్ని ఆస్వాదించడానికి తనకు ఆ కళ్లద్దాలు కావాలని గతంలో ఆనంద్ ట్వీట్ చేశారు. 


అనంతరం భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టీ-20 అనంతరం మరో ట్వీట్ చేశారు. అక్షర్ ధరించిన కళ్లద్దాల్లాంటివి సంపాదించానని చెప్పారు. అప్పుడు ఓ నెటిజన్ ఆ కళ్లద్దాలు ధరించి దిగిన ఫొటోను పోస్ట్ చేయమని అడిగాడు. దానికి స్పందించిన ఆనంద్ మహీంద్ర.. టీమిండియా టీ20 సిరీస్ కూడా గెలిస్తే తప్పకుండా ఆ ఫొటో పోస్ట్ చేస్తానని చెప్పారు. తాజాగా కోహ్లీ సిరీస్ చేజిక్కించుకోవడంతో ఆనంద్ తన మాట నిలబెట్టుకున్నారు. `అక్షర్ షేడ్స్` ధరించి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 

Updated Date - 2021-03-22T16:23:01+05:30 IST