BWF World Championships: యమగుచికే మహిళల సింగిల్స్ కిరీటం

ABN , First Publish Date - 2021-12-19T23:24:35+05:30 IST

బీడబ్ల్యూఎఫ్ వర్డల్ చాంపియన్‌షిప్ మహిళ సింగిల్స్‌లో జపాన్ క్రీడాకారిణి అకానే యమగుచి విజేతగా నిలిచింది

BWF World Championships: యమగుచికే మహిళల సింగిల్స్ కిరీటం

వెల్వా (స్పెయిన్): బీడబ్ల్యూఎఫ్ వర్డల్ చాంపియన్‌షిప్ మహిళ సింగిల్స్‌లో జపాన్ క్రీడాకారిణి అకానే యమగుచి విజేతగా నిలిచింది. ప్రపంచ నంబర్ 1 చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్‌తో జరిగిన పోరులో 21-14, 21-11తో వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. తై జు రజతంతో సరిపెట్టుకుంది.


టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌లో సింధును ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన తైజు.. స్వర్ణ పతక పోరులో చైనాకు చెందిన చెన్ యుఫే చేతిలో పరాజయం పాలై రజతంతో సంతృప్తి పడింది. కాగా, యమగుచికి ఇది వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఇది రెండో పతకం. 2018లో జరిగిన నాన్జింగ్ వరల్డ్ మీట్‌లో యమగుచి కాంస్య పతకం సాధించింది. 

Updated Date - 2021-12-19T23:24:35+05:30 IST