స్కాంట్లాడ్ బౌలర్లను నిర్భయంగా ఎదుర్కొంటున్న ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్
ABN , First Publish Date - 2021-10-26T01:57:27+05:30 IST
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్ 12 గ్రూప్-2లో భాగంగా స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘన్

షార్జా: ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్ 12 గ్రూప్-2లో భాగంగా స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ నిర్భయంగా ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జాజాయ్ మహమ్మద్ షాజాద్ శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు.
ఈ క్రమంలో 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 22 పరుగులు చేసిన షాజాద్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ జాజాయ్ కూడా పెవిలియన్ చేరాడు. క్రీజులో ఉన్నంత సేపు అతడు మెరుపులు మెరిపించాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిశాయి. ఆఫ్ఘన్ 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. రహమానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్ క్రీజులో ఉన్నారు.