62 ఏళ్ల మహిళపై కొన్ని నెలలుగా 75 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

ABN , First Publish Date - 2021-11-28T22:19:43+05:30 IST

62 ఏళ్ల మహిళపై 75 ఏళ్ల వృద్ధుడు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్

62 ఏళ్ల మహిళపై కొన్ని నెలలుగా 75 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

భోపాల్: 62 ఏళ్ల మహిళపై 75 ఏళ్ల వృద్ధుడు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మహారాష్ట్రకు చెందిన బాధిత మహిళ నిందితుడి ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఇంటి పనులు చేస్తూ  పొట్టపోసుకుంటోంది. తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే నిందితుడు కొన్ని నెలలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.


ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తనను హెచ్చరించాడని పేర్కొంది. పరీక్షల కోసం బాధిత వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. కాగా, బాధితురాలిపైనా నిందితుడు కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-11-28T22:19:43+05:30 IST