ఒకే ఓవర్లో 6 వికెట్లు

ABN , First Publish Date - 2021-12-13T09:36:02+05:30 IST

క్రికెట్‌లో హ్యాట్రిక్‌ అరుదు. అలాంటిది ఒకే ఓవర్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ అంటే నమ్మలేం, ఊహించలేం. సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది.

ఒకే ఓవర్లో 6 వికెట్లు

దుబాయ్‌ టీనేజ్‌ స్పిన్నర్‌ అరుదైన ఘనత

దుబాయ్‌: క్రికెట్‌లో హ్యాట్రిక్‌ అరుదు. అలాంటిది ఒకే ఓవర్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ అంటే నమ్మలేం, ఊహించలేం. సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది.  కానీ దుబాయ్‌ టీనేజ్‌ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ హర్షిత్‌ సేథ్‌ అసాధ్యాన్ని సుసాఽధ్యం చేసి చరిత్ర సృష్టించాడు. ఒక ఓవర్లోని ఆరు బంతులకు ఆరు వికెట్లు తీసి అత్యంత అరుదైన ఘట్టాన్ని అతడు ఇటీవల ఆవిష్కరించాడు. పాకిస్థాన్‌కు చెందిన హైదరాబాద్‌ అకాడమీ హాక్స్‌ ఆర్‌సీజీ జట్టుపై హర్షిత్‌ ఈ ఘనత సాధించాడు. మ్యాచ్‌లో సేథ్‌ మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టడంతో హాక్స్‌ కేవలం 44 పరుగులకే కుప్పకూలింది. ఆరు జట్ల అండర్‌-19 కార్వాన్‌ గ్లోబల్‌ టీ20 లీగ్‌లో దుబాయ్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ స్టారెట్స్‌కు హర్షిత్‌ ప్రాతినిధ్యం వహించాడు. 

Updated Date - 2021-12-13T09:36:02+05:30 IST