ఫిజిక్స్ పేపర్‌లో చిక్కు ప్రశ్న.. హెలికాఫ్టర్‌‌తో ప్రయోగం చేసి మరీ సమాధానం కనుక్కున్న యూట్యూబర్!

ABN , First Publish Date - 2021-11-01T04:31:46+05:30 IST

ఫిజిక్స్, మ్యాథ్స్‌లలో ప్రశ్నలు చాలా కష్టంగా ఉంటాయని అనేక మంది విద్యార్థులు భావిస్తుంటారు. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. అయితే.. ఓ యూట్యూబర్ మాత్రం ఫిజిక్స్‌ సబ్జెక్టుకు చెందిన ఓ చిక్కు ప్రశ్నకు ఓ భారీ ప్రయోగం చేసి మరీ సమాధానం కనుక్కున్నాడు.

ఫిజిక్స్ పేపర్‌లో చిక్కు ప్రశ్న.. హెలికాఫ్టర్‌‌తో ప్రయోగం చేసి మరీ సమాధానం కనుక్కున్న యూట్యూబర్!

ఇంటర్నెట్ డెస్క్: ఫిజిక్స్, మ్యాథ్స్‌లలో ప్రశ్నలు చాలా కష్టంగా ఉంటాయని అనేక మంది విద్యార్థులు భావిస్తుంటారు. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. అయితే.. ఓ యూట్యూబర్ మాత్రం ఫిజిక్స్‌ సబ్జెక్టుకు చెందిన ఓ చిక్కు ప్రశ్నకు ఓ భారీ ప్రయోగం చేసి మరీ సమాధానం కనుక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రశ్నను 2014లో అమెరికా ఫిజిక్స్ పరీక్షలో అడిగారు. అదేంటంటే.. ఓ హెలికాఫ్టర్ గాల్లో కుడివైపుకు ఎగురుతున్న సందర్భంలో దాని నుంచి వేలాడుతున్న తాడు ఏ వైపునకు వంగుతుంది.. అనేది ప్రశ్న. ఇందుకు సంబంధించి చిత్రాల రూపంలో పలు ఆప్షన్లు ఉన్నాయి. విద్యార్థులో వీటిల్లోంచి సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా అయితే.. విద్యార్థులు తాడుపై పడుతున్న వివిధ రకాల ఫోర్సెస్‌ను విశ్లేషించి సమాధానం కనుక్కోవాలి. ఇదంతా పేపర్‌పైనే చేయాలి. కానీ ఓ యూట్యూబర్ మాత్రం ఓ హెలికాఫ్టర్‌ను అద్దెకు తీసుకుని దానికి తాడు కట్టాడు. ఆ తరువాత.. హెలికాఫ్టర్ గాల్లో ఉండగా తాడు ఏవైపునకు వంగుతోందో గమనించి మరీ సమాధానం కనుక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

                                  వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండిUpdated Date - 2021-11-01T04:31:46+05:30 IST