బ్రేక్ ఏదో యాక్సెలరేటర్ ఏదో తెలీక తికమకపడి.. మలుపు దగ్గర ఇలా అనూహ్యంగా..
ABN , First Publish Date - 2021-10-31T03:32:45+05:30 IST
కారులో బ్రేక్ ఏదో యాక్సెలరేటర్ ఏదో తెలీక అకస్మాత్తుగా తికమకపడ్డ ఓ యువకుడు లక్షల రూపాయల విలువైన లాంబోర్ఘినీ కారును నేరుగా సరస్సులోకి పోనిచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: కారులో బ్రేక్ ఏదో యాక్సెలరేటర్ ఏదో తెలీక అకస్మాత్తుగా తికమకపడ్డ ఓ యువకుడు లక్షల రూపాయల విలువైన లాంబోర్ఘినీ కారును నేరుగా సరస్సులోకి పోనిచ్చాడు. అయితే.. కారు నీళ్లలో మునిగిపోయినప్పటికీ అతడు మాత్రం అదృష్టవశాత్తూ ఈదుకుంటూ కొలనులోంచి బయటకు రాగలిగాడు. చిన్నపాటి గాయాలతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మరి యువకుడికి డ్రైవింగ్ రాదా అంటే వచ్చు.. కానీ..అకస్మాత్తుగా తికమకపడి ప్రమాదంలో చిక్కాడు. ఆస్ట్రియాలోని మాండ్సీ ప్రాంతంలో ఇటీవలీ ఈ ఘటన జరిగింది. పోలీసులు, ఇతర విపత్తు నిర్వహణ సిబ్బందితో కలిసి కారును కొలను నుంచి బయటకు తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాగా.. ఆ కారు కొలనులో దాదాపు 50 అడుగుల లోతుకు దిగబడిపోయిందని అక్కడున్న వారు తెలిపారు. కారును మలుపు తిప్పే క్రమంలో అతడు ఇలా తికమకపడి ప్రమాదంలో పడ్డాడని స్థానిక పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.