విలువైన వస్తువులతో విమానమెక్కిన మహిళ.. ఫ్లైట్ దిగాక ఊహించని షాక్!

ABN , First Publish Date - 2021-12-27T03:02:58+05:30 IST

ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికాకు చేరుకున్న మహిళను అనూహ్య అనుభవం ఎదురైంది. పర్యటన సందర్భంగా తాను కొనుక్కున్న బహుమతులు ఆమె విమానం దిగాక కనిపించకుండా పోవడంతో ఆమె అవాక్కైంది.

విలువైన వస్తువులతో విమానమెక్కిన మహిళ..  ఫ్లైట్ దిగాక ఊహించని షాక్!

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికాకు చేరుకున్న మహిళకు విమానం దిగాక అనూహ్య అనుభవం ఎదురైంది. పర్యటన సందర్భంగా తాను కొనుక్కున్న విలువైన వస్తువులు కనిపించుకుండా పోవడంతో ఆమె అవాక్కైంది. న్యూహాంప్‌షైర్ రాష్ట్రానికి చెందిన జినా షెల్డన్ ఇటీవల ఎదుర్కొన్న పరిస్థితి ఇది. తన కొనుక్కున్న వస్తువుల విలువ దాదాపు 4 లక్షలని(మన కరెన్సీలో..) ఆమె వాపోయింది. వాటన్నిటినీ ఓ బ్యాగులో పెట్టి కార్గొలో వేశానని, విమానం దిగాక ఆ బ్యాగును తెరిచి చూస్తే అందులో కుక్కలకు పెట్టే ఆహారం, షేవింగ్ క్రీమ్ కనిపించాయని చెప్పింది. బ్యాగుల ఆటోమేటిక్ తనిఖీ సమయంలో ఫ్రాన్స్‌లోనే తన బ్యాగుకు బదులు మరో బ్యాగు వచ్చి చేరి ఉంటుందని ఆమె పేర్కొంది. కాగా.. ఈ ఘటనపై స్పందించిన డెల్టా ఎయిర్‌లైన్స్...వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని మహిళకు హామీ ఇచ్చింది. 

Updated Date - 2021-12-27T03:02:58+05:30 IST