అమెరికా నుంచి భారత్ చేరిన 1.25 లక్షల వయల్స్ రెమ్‌డెసివిర్!

ABN , First Publish Date - 2021-05-03T05:08:23+05:30 IST

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో మన దేశానికి అండగా నిలిచేందుకు పలుదేశాలు ముందుకొచ్చాయి.

అమెరికా నుంచి భారత్ చేరిన 1.25 లక్షల వయల్స్ రెమ్‌డెసివిర్!

వాషింగ్టన్: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో మన దేశానికి అండగా నిలిచేందుకు పలుదేశాలు ముందుకొచ్చాయి. వాటిలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఒకటి. భారత్‌కు సాధ్యమైనంత సాయం, సాధ్యమైనంత వేగంగా చేస్తామని స్వయంగా బైడెన్ కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు అమెరికా హామీ ఇచ్చిన కొవిడ్-19 రిలీఫ్ షిప్‌మెంట్‌లో భాగంగా 1.25 లక్షల రెమ్‌డెసివిర్ వయల్స్‌ యూఎస్ నుంచి భారత్ చేరుకున్నాయి.


దీని కన్నా ముందు అమెరికా నుంచి ఒక విమానం.. వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు తదితర మెడికల్ పరికరాలను తీసుకొని భారత్ చేరుకుంది. ఇవన్నీ మూడో విడత సపోర్ట్ ప్యాకేజీలో భాగంగా భారత్‌కు వచ్చాయి. ఇప్పుడు తాజాగా నాలుగో విడతలో భాగంగా రెమ్‌డెసివిర్ వచ్చింది. వీటితోపాటు ఎన్95 మాస్కులు, కీలకమైన మెడికల్ సప్లైలు కూడా భారత్‌కు యూఎస్ అందించింది.

Updated Date - 2021-05-03T05:08:23+05:30 IST