భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు యూఎస్‌లోకి నో ఎంట్రీ!

ABN , First Publish Date - 2021-05-02T13:13:25+05:30 IST

భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నెల 4 నుంచి భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై పరిమితులు విధిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది.

భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు యూఎస్‌లోకి నో ఎంట్రీ!

వాషింగ్టన్‌: భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నెల 4 నుంచి భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై పరిమితులు విధిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. గడిచిన 14 రోజుల్లో భారతదేశంలో బస చేసిన తమపౌరులు కానివారందరికీ అమెరికా ప్రయాణాన్ని నిషేధిస్తూ అధ్యక్షుడు బైడెన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో వైరస్‌ లోడ్‌ తీవ్రంగా ఉండడం, వివిధ వేరియంట్ల వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు, విద్యావేత్తలు, పాత్రికేయులు, కొవిడ్‌ సహాయ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణిస్తున్న వారిపై పరిమితులూ ఉండవని అమెరికా మంత్రి టోనీ బ్లింకెన్‌ తెలిపారు.

Updated Date - 2021-05-02T13:13:25+05:30 IST