క్రిస్మస్ పర్వదినం.. అమెరికా అధ్యక్షుడి ఊహించని సర్‌ప్రైజ్!

ABN , First Publish Date - 2021-12-26T00:13:44+05:30 IST

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ వాషింగ్టన్‌లోని చిల్డ్రన్స్ నేషనల్ ఆస్పత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను సర్‌ప్రైజ్ చేశారు.

క్రిస్మస్ పర్వదినం.. అమెరికా అధ్యక్షుడి ఊహించని సర్‌ప్రైజ్!

ఇంటర్నెట్ డెస్క్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ వాషింగ్టన్‌లోని చిల్డ్రన్స్ నేషనల్ ఆస్పత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను సర్‌ప్రైజ్ చేశారు. వాస్తవానికి ఈ కార్యక్రమం ప్రతి ఏటా జరిగేదే అయినప్పటికీ.. సాధారణంగా అధ్యక్షుల భార్యలే ఆస్పత్రిని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఈ మారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా ఆస్పత్రిని సందర్శించి ఓ కొత్త ఒరవడికి నాంది పలికారు. అధ్యక్షుడు స్వయంగా ఆస్పత్రిని సందర్శించడం ఇదే తొలిసారని అక్కడి మీడియా పేర్కొంది. ఆస్పత్రిలోని పిల్లలకు బహుమతులు అందించిన బైడెన్ దంపతులు.. ఓలాఫ్ నైట్ బిఫోర్ క్రిస్మస్ కథను కూడా చదివి వినిపించారు. క్రిస్మస్ రోజున అధ్యక్షుడిని స్వయంగా కలుసుకున్నందుకు చిన్నారులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. 

Updated Date - 2021-12-26T00:13:44+05:30 IST