భారతీయ విద్యార్థులకు అమెరికా భారీ ఊరట
ABN , First Publish Date - 2021-05-05T13:09:47+05:30 IST
స్టూడెంట్ వీసా ఉన్న భారతీయ విద్యార్థులకు అమెరికా ఊరటనిచ్చింది.

స్టూడెంట్ వీసా ఉన్న భారతీయ విద్యార్థులకు అమెరికా ఊరటనిచ్చింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారతీయుల అమెరికా ప్రయాణాలపై ఆంక్షల నుంచి విద్యార్థులకు మినహాయింపు కల్పించింది. అమెరికాలో అడ్మిషన్ పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీలో ఆగస్టు 1వ తేదీ, తర్వాత క్లాసులు ప్రారంభమైతే, అలాంటి విద్యార్థులు అమెరికా వెళ్లొచ్చు. ఎఫ్-1, ఎం-1 వీసాలున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. వీరు అమెరికా వెళ్లడానికి భారత్‌లోని యూఎస్ ఎంబసీలనుగానీ, కాన్సులేట్‌నుగానీ సంప్రదించాల్సిన అవసరం లేదు. ఆగస్టు 1 కంటే ముందు క్లాసులకు హాజరుకావాల్సి ఉన్న విద్యార్థులు మాత్రం సంబంధిత విద్యాసంస్థలను సంప్రదించాలి.