తిరుగుబాటు కుట్రదారులకు యూఎస్ నుంచి ఆర్థికసాయం: మెక్సికో

ABN , First Publish Date - 2021-05-09T02:47:03+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాపై దాని పొరుగుదేశం మెక్సికో సంచలన ఆరోపణలు చేసింది. తమ దేశంలో తిరుగుబాటు కోసం కుట్రలు చేస్తున్న బృందాలకు అమెరికా నుంచి ఆర్థికసాయం అందుతోందని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ ఆరోపించారు.

తిరుగుబాటు కుట్రదారులకు యూఎస్ నుంచి ఆర్థికసాయం: మెక్సికో

మెక్సికో: అగ్రరాజ్యం అమెరికాపై దాని పొరుగుదేశం మెక్సికో సంచలన ఆరోపణలు చేసింది. తమ దేశంలో తిరుగుబాటు కోసం కుట్రలు చేస్తున్న బృందాలకు అమెరికా నుంచి ఆర్థికసాయం అందుతోందని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ ఆరోపించారు. దేశంలో తిరుగుబాటు కుట్రదారులను ప్రోత్సహించే ఒక అవినీతి-నిరోధక సంస్థకు అమెరికా నుంచి ఆర్థికసాయం వస్తోందని మెక్సికో వెల్లడించింది. మెక్సికన్స్ ఎగైనెస్ట్ కరప్సన్ అండ్ ఇంప్యూనిటీ(ఎంసీసీఐ) సంస్థ తన వెబ్‌సైటులో తమకు ఆర్థిక సాయం అందించే దాతల పేర్లను పేర్కొంది.


వాటిలో యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ ఎయిడ్) కూడా ఉంది. అయితే ఎంసీసీఐ ఒక రాజకీయ బృందం అని చెప్పిన మెక్సికో.. దానికి అమెరికా నుంచి అందుతున్న ఆర్థికసాయాన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని కోరింది.

Updated Date - 2021-05-09T02:47:03+05:30 IST