'హెచ్-​1బీ వీసాల జారీని రెట్టింపు చేయండి.. గ్రీన్‌కార్డు కోటాను ఎత్తివేయండి'

ABN , First Publish Date - 2021-06-22T18:14:09+05:30 IST

అగ్ర‌రాజ్యంలో నైపుణ్య ఉద్యోగుల కొరతను దృష్టిలో పెట్టుకుని హెచ్-​1బీ వీసాల జారీని రెట్టింపు చేయాలని జో బైడెన్​ స‌ర్కార్‌ను యూఎస్​ ఛాంబర్స్​ ఆఫ్​ కామర్స్​ అభ్యర్థించింది. అలాగే గ్రీన్ కార్డుల జారీలో అమ‌లు చేస్తున్న దేశాల వారీ కోటాను(కంట్రీ క్యాప్‌) కూడా ఎత్తివేయాల‌ని కోరింది.

'హెచ్-​1బీ వీసాల జారీని రెట్టింపు చేయండి.. గ్రీన్‌కార్డు కోటాను ఎత్తివేయండి'

వాషింగ్ట‌న్‌: అగ్ర‌రాజ్యంలో నైపుణ్య ఉద్యోగుల కొరతను దృష్టిలో పెట్టుకుని హెచ్-​1బీ వీసాల జారీని రెట్టింపు చేయాలని జో బైడెన్​ స‌ర్కార్‌ను యూఎస్​ ఛాంబర్స్​ ఆఫ్​ కామర్స్​ అభ్యర్థించింది. అలాగే గ్రీన్ కార్డుల జారీలో అమ‌లు చేస్తున్న దేశాల వారీ కోటాను(కంట్రీ క్యాప్‌) కూడా ఎత్తివేయాల‌ని కోరింది. ప‌రిమిత సంఖ్య‌లో గ్రీన్ కార్డు ఇస్తుండ‌డంతో ప్రవాసులు ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోందని పేర్కొంది. దాని వల్ల ఉద్యోగుల కొరత తీవ్రత‌రం అవుతుందని తెలియ‌జేసింది. కనుక ఈ విధానాన్ని పూర్తిగా స్వ‌స్తి ప‌ల‌కాలని కోరింది. అంతేగాక‌ గ్రీన్​ కార్డు కంట్రీ క్యాప్‌ కింద కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఇచ్చే హెచ్​-1బీ వీసా విధానాన్ని రద్దు చేసి, ఒక్కొక్కరికి ఇచ్చేలా మార్పులు చేయాలని అభ్య‌ర్థించింది. ఈ విధానం వ‌ల్ల‌ ప్రస్తుతం 65వేల‌ వీసాల జారీని రెట్టింపు చేసే వీలు క‌లుగుతుంద‌ని తెలిపింది. 


ఇక అమెరికాలో నైపుణ్య ఉద్యోగుల కొర‌త‌ను తీర్చాలంటే హెచ్-​1బీ, హెచ్‌-2బీ వీసాల జారీని రెట్టింపు చేయ‌డ‌మే ఏకైక మార్గమ‌ని ఈ సంద‌ర్భంగా యూఎస్ ఛాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ పేర్కొంది. అలాగే ఇమిగ్రేషన్​ చట్టాల్లో కూడా మార్పులు చేయాల‌ని సూచించింది. యూఎస్​ ఛాంబర్స్​ ఆఫ్​ కామర్స్​ అధ్య‌క్షుడు, సీఈఓ సుజానే క్లార్క్‌ మాట్లాడుతూ "మేము కార్మికులకు అవసరమైన నైపుణ్యాలతో ఆయుధాలు కలిగి ఉండాలి. చాలా మంది అమెరికన్లను పక్కదారి పట్టించే అడ్డంకులను మేము తప్పక తొలగించాలి. అధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాలను పూరించడానికి ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన వారిని నియమించాలి. కార్మికుల కొరత దేశవ్యాప్తంగా ఉద్యోగ సృష్టికర్తలను వెనక్కి నెట్టివేస్తోంది" అని అన్నారు. 

Updated Date - 2021-06-22T18:14:09+05:30 IST