స్కూలు బస్సు హైజాక్ చేసిన ఆర్మీ ట్రైనీ.. ప్రశ్నలు తట్టుకోలేక పిల్లల్ని వదిలేశాడు!

ABN , First Publish Date - 2021-05-09T04:25:10+05:30 IST

తుపాకీతో ఒక స్కూలు బస్సు ఎక్కిన ఆర్మీ ట్రైనీ ఆ బస్సును హైజాక్ చేశాడు. ఆ సమయంలో భయపడిపోయిన పిల్లలు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించడంతో విసుగెత్తిన అతను.. పిల్లల్ని వదిలేశాడు! నమ్మడానికి వింతగా ఉన్న ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో వెలుగు చూసింది.

స్కూలు బస్సు హైజాక్ చేసిన ఆర్మీ ట్రైనీ.. ప్రశ్నలు తట్టుకోలేక పిల్లల్ని వదిలేశాడు!

వాషింగ్టన్: తుపాకీతో ఒక స్కూలు బస్సు ఎక్కిన ఆర్మీ ట్రైనీ ఆ బస్సును హైజాక్ చేశాడు. ఆ సమయంలో భయపడిపోయిన పిల్లలు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించడంతో విసుగెత్తిన అతను.. పిల్లల్ని వదిలేశాడు! నమ్మడానికి వింతగా ఉన్న ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో వెలుగు చూసింది. ఒక 23 ఏళ్ల ఆర్మీ ట్రైనీ.. పిల్లలతో నిండి ఉన్న ఒక స్కూలు బస్సును హైజాక్ చేశాడు. అతడి చేతిలో ఆయుధం ఉండటం చూసిన పిల్లలు భయపడిపోయారు. దాంతో అతడిని రకరకాల ప్రశ్నలు అడిగారు. సదరు హైజాకర్ తమను గాయపరుస్తాడా? లేక డ్రైవర్‌నా? హైజాక్ చేశాక ఏం చేస్తాడు? ఎక్కడకు తీసుకెళ్తాడు? వంటి ప్రశ్నలతో అతనికి విసుగెత్తించారీ పిల్లలు.


దీంతో వారందరినీ హైజాకర్ వదిలేసినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 19 కౌంట్ల కిడ్నాపింగ్, ఆర్మ్‌డ్ రాబరీ, ఇతర నేరాలు చేసినట్లు అతనిపై కేసు నమోదు చేసుకున్నారు.

Updated Date - 2021-05-09T04:25:10+05:30 IST