యూకేలో ఒకేరోజు 5 వేలకు పైగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-14T10:25:39+05:30 IST

యూకేలో గడిచిన 24 గంటల్లో 5,534 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది.

యూకేలో ఒకేరోజు 5 వేలకు పైగా కరోనా కేసులు

లండన్: యూకేలో గడిచిన 24 గంటల్లో 5,534 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 42,53,820కు చేరుకుంది. మరోపక్క ఒకేరోజు కరోనా కారణంగా 121 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,25,464గా ఉంది. యూకే ప్రభుత్వం సమర్థవంతంగా కరోనాను నియంత్రించగలుగుతోంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటమే ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో జూన్ చివరి నాటికి యూకే వ్యాప్తంగా కరోనా నిబంధనలను పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోంది. నాలుగు అంచెల ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా మార్చి 8న యూకే వ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకున్నాయి. మరోపక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతోంది. యూకేలో ఇప్పటివరకు 2.36 కోట్ల మంది వ్యాక్సిన్ డోస్‌ను తీసుకున్నారు.

Updated Date - 2021-03-14T10:25:39+05:30 IST