యూకేలో ఒకేరోజు 5 వేలకు పైగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-22T11:35:14+05:30 IST

కరోనా మహమ్మారి యూకేను వణికిస్తూనే ఉంది. ఒకపక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంటే..

యూకేలో ఒకేరోజు 5 వేలకు పైగా కరోనా కేసులు

లండన్: కరోనా మహమ్మారి యూకేను వణికిస్తూనే ఉంది. ఒకపక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంటే.. మరోపక్క కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. తాజాగా యూకే వ్యాప్తంగా 5,312 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,96,583కు చేరుంది. మరోపక్క ఒకేరోజు కరోనా బారిన పడి 33 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,26,155గా ఉంది. ఇదిలా ఉంటే.. యూకేలో ఇప్పటివరకు దాదాపు 2.8 కోట్ల మంది వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. 50 శాతం యుక్తవయస్కులు మొదటి డోస్ తీసుకోవడంతో ప్రధాని బోరిస్ జాన్సన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ ఇలానే కొనసాగుతూ పోవాలని ఆయన అన్నారు. జూలై చివరి నాటికి యుక్తవయస్కులందరికి వ్యాక్సిన్ డోస్‌ ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. గడిచిన 24 గంట్లలో యూకేలో 8,73,000 మంది వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. 

Updated Date - 2021-03-22T11:35:14+05:30 IST