యూకేలో ఒకేరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-02-01T06:04:48+05:30 IST

యూకేను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో యూకే వ్యాప్తంగా 21,088 మంది కరోనా బారిన పడినట్టు

యూకేలో ఒకేరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు

లండన్: యూకేను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో యూకే వ్యాప్తంగా 21,088 మంది కరోనా బారిన పడినట్టు ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 38,17,176కు చేరుకుంది. మరోపక్క ఒకే రోజు కరోనా కారణంగా 587 మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,06,158గా ఉంది. కరోనా కొత్త స్ట్రెయిన్ దేశాన్ని కలవర పెడుతుండటంతో ప్రభుత్వం వీలైనంత త్వరగా మహమ్మారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. 


ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. అతి తక్కువ సమయంలో లక్షలాది మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటోంది. యూకే వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 90 లక్షల మంది వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. ఫిబ్రవరి 15 లోపు 1.5 కోట్ల మందికి వ్యాక్సిన్ మొదటి డోస్ ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మరోపక్క కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను కొనసాగిస్తోంది.

Updated Date - 2021-02-01T06:04:48+05:30 IST