అంతరిక్షానికి ఫుడ్ డెలివరీ.. డెలివరీ బాయ్‌గా ఓ బిలియనీర్.. చరిత్ర సృష్టించిన ఊబెర్

ABN , First Publish Date - 2021-12-16T02:04:32+05:30 IST

ఫుడ్ డెలివరీ యాప్‌‌లు జొమాటో, స్విగ్గీల్లో ఆర్డర్ పెడితే చాలు.. మన ఇంటికే మంచి రుచికరమైన ఆహారం వస్తుంది. అయితే.. ఇదంతా భూమికి మాత్రమే పరిమితమైన వ్యవహారం. కానీ.. ఫుడ్ డెలివరీ సంస్థ ఊబెర్ ఈట్స్ తాజాగా చరిత్ర సృష్టించింది. ఏకంగా అంతరిక్షానికి ఫుడ్ డెలివరీ చేసింది. అది కూడా ఓ అపరకుబేరుడి(బిలియనీర్) సాయంతో..!

అంతరిక్షానికి ఫుడ్ డెలివరీ.. డెలివరీ బాయ్‌గా ఓ బిలియనీర్.. చరిత్ర సృష్టించిన ఊబెర్

ఇంటర్నెట్ డెస్క్: ఫుడ్ డెలివరీ యాప్‌‌లు జొమాటో, స్విగ్గీల్లో ఆర్డర్ పెడితే చాలు.. మన ఇంటికే మంచి రుచికరమైన ఆహారం వస్తుంది. అయితే.. ఇదంతా భూమికి మాత్రమే పరిమితమైన వ్యవహారం. కానీ.. ఫుడ్ డెలివరీ సంస్థ ఊబెర్ ఈట్స్ తాజాగా చరిత్ర సృష్టించింది. ఏకంగా అంతరిక్షానికి ఫుడ్ డెలివరీ చేసింది.  అది కూడా ఓ అపరకుబేరుడి(బిలియనీర్) సాయంతో..! అసలు ఇదంతా ఎలా సాధ్యమైందో తెలిస్తే.. ఆశ్చర్యం కలుగక మానదు! 


అంతరిక్ష ప్రయాణంపై మక్కువ పెంచుకున్న జపాన్ బిలియనీర్ యూసాకు మేజావా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కాలు పెట్టి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. డిసెంబర్ 11న ఆయన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆయనతో పాటే ఊబెర్ ఈట్స్ నుంచి కొన్ని ఆహార పదార్థాలు కూడా వెళ్లాయి. అక్కడికి చేరుకున్న 9 గంటల తరువాత.. యూసాకు తన వెంట తెచ్చుకున్న ఊబెర్ ఈట్స్ ఆహార పదార్థాలను.. ఊబెర్ ఈట్స్ క్యాప్ పెట్టుకుని మరీ అక్కడి వ్యోమగాములకు ఇచ్చారు. ఈ విషయాన్ని ఊబెర్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఎక్కడికైనా చేరుకుంటాం.. ఏదైనా డెలివరీ చేస్తాం.. ఇది మాకు ప్రారంభం మాత్రమే’ అంటూ కామెంట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా.. యూసాకు 12 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడపనున్నారు. ఈ టూర్ కోసం ఆయన దాదాపు రూ. 608 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటీవల కాలంలో అనేక మంది బిలియనీర్లు  అంతరిక్ష యాత్రల పట్ల మక్కువ చూపుతున్న విషయం తెలిసిందే. Updated Date - 2021-12-16T02:04:32+05:30 IST