ఒమాన్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత ప్రవాసుల దుర్మరణం!

ABN , First Publish Date - 2021-01-12T14:20:09+05:30 IST

ఒమాన్‌లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత ప్రవాసులు దుర్మరణం చెందారు.

ఒమాన్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత ప్రవాసుల దుర్మరణం!

మస్కట్: ఒమాన్‌లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత ప్రవాసులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులందరూ ఇండియన్ స్కూల్ మస్కట్ పూర్వ విద్యార్థులు. జబల్ షామ్స్ నుంచి మస్కట్ తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు ప్రమాదస్థలిలోనే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 'ఈ ఘటన మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. మా ఇద్దరు పూర్వ విద్యార్థులను కోల్పోవడం ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మరపురాని, చిరస్మరణీయమైన వారి స్నేహాలు పూర్వ విద్యార్థుల హృదయాల్లో ఎప్పుడూ ఉంటాయి. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడితో ప్రార్థిస్తున్నాం.' అని ఇండియన్ స్కూల్ మస్కట్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముకుంద్ మనోహర్ అన్నారు. 

Updated Date - 2021-01-12T14:20:09+05:30 IST