టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మళ్లీ కేసీఆరే ఉండాలి.. ఎన్నారైల తరపున మహేష్ బిగాల నామినేషన్

ABN , First Publish Date - 2021-10-20T22:58:13+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయిన సంగతి తెలిసిందే. పార్టీ నియమావళిని అనుసరించి నాలుగేళ్లకు ఓ సారి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతుంటాయి.

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మళ్లీ కేసీఆరే ఉండాలి.. ఎన్నారైల తరపున మహేష్ బిగాల నామినేషన్

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయిన సంగతి తెలిసిందే. పార్టీ నియమావళిని అనుసరించి నాలుగేళ్లకు ఓ సారి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతుంటాయి. పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు ఎవరైనా పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయవచ్చు. అయితే ప్రస్తుతానికి కేసీఆర్ తరపునే వివిధ విభాగాల నేతలు నామినేషన్ వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ కేసీఆరే ఉండాలని కోరుతూ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ తెరాస ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల వివిధ దేశాల తెరాస ప్రతినిధులతో కలిసి రిటర్నింగ్‌ అధికారి ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేశారు.


మహేష్ బిగాలతోపాటు పలువురు ఎన్నారైలు తెరాస పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ కల సాకారం కోసం అహర్నిశలు కష్టపడుతున్న కేసీఆర్‌నే మళ్లీ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మహేష్ బిగాల వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలతోపాటు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమములో సౌత్ ఆఫ్రికా శాఖ నుంచి ఆ శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల, హరీష్ రంగ,సౌజన్ రావు,సాయి కిరణ్ వేముల, యూకే శాఖ నుంచి  రత్నాకర్ కడుదుల, రమేష్ ఎస్సంపల్లి, శ్రీనివాస్ వల్లల, మల్లేష్ పప్పు, తాటికుంట వేణుగోపాల్, ప్రవీణ్ పంతులు, సుభాష్ కోరుపల్లి, తాటికుంట జనార్దన్ రెడ్డి, మాల్దీవుల శాఖ నుంచి అధ్యక్షుడు రాకేశ్ దత్తాత్రేయారా, కువైత్ నుంచి అధ్యక్షురాలు  అభిలాష గొడిసాలా, జగదీశ్ ఉప్పల, ఇటలీ శాఖ నుంచి  వినయ్, ఆస్ట్రియా శాఖ నుంచి అధ్యక్షులు వివేక్, ఫిన్లాండ్ నుంచి  అధ్యక్షులు సందీప్, ఇటలీ నుంచి వినయ్, జాంబియా నుంచి రాహుల్ రెడ్డి , వియాత్నం నుంచి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T22:58:13+05:30 IST