విదేశీ పర్యాటకులకు యూఏఈ గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2021-03-22T16:02:56+05:30 IST

యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు సిద్ధం అయింది. విదేశీ పర్యాటకులను, నిపుణులను ఆ

విదేశీ పర్యాటకులకు యూఏఈ గుడ్‌న్యూస్!

అబుధాబి: యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  కరోనా కారణంగా తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు సిద్ధం అయింది. విదేశీ పర్యాటకులను, నిపుణులను ఆకర్షించడం కోసం ఏడాది, ఐదు సంవత్సరాల కాలపరిమితితో వీసాలను ప్రవేశపెట్టింది. నిపుణులకు వర్క్ వీసాలను, పర్యాటకుల కోసం మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలను జారీ చేసే ప్రతిపాదనకు యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షన సమావేశమైన క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగి తన నియామక సంస్థ యూఏఈలో లేనప్పటికీ.. యూఏఈలో నివసిస్తూ తన ఉద్యోగాన్ని చేసుకునేందుకు వర్క్ వీసా దోహదపడుతుందని ఆ దేశ ప్రధాని తెలిపారు. ఇక మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలను కూడా అన్ని దేశాల పౌరులకు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. యూఏఈలో నిన్న ఒక్కరోజే 1700 మందికిపైగా కరోనా బారినపడగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ నమోదైన కేసుల సంఖ్య 4.4లక్షలు దాటింది. మరణాల సంఖ్య 1438కి చేరింది. 


Updated Date - 2021-03-22T16:02:56+05:30 IST