కరోనా ఆంక్షలను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన ప్రజలు.. జర్మనీలో..

ABN , First Publish Date - 2021-03-21T05:36:30+05:30 IST

కరోనా మహమ్మారి ఒకవైపు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కరోనాను నియంత్రించేందుకు అనేక దేశాలు ఇప్పటికీ

కరోనా ఆంక్షలను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన ప్రజలు.. జర్మనీలో..

బెర్లిన్: కరోనా మహమ్మారి ఒకవైపు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కరోనాను నియంత్రించేందుకు అనేక దేశాలు ఇప్పటికీ కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయితే కొన్ని దేశాల్లో కరోనా ఆంక్షలను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జర్మనీలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంక్షలను వ్యతిరేకిస్తూ దాదాపు పది వేల మంది రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. శనివారం జర్మనీలోని కాసెల్ నగరంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రే, బేటన్లను ఉపయోగించాల్సి వచ్చింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జర్మనీలో గడిచిన ఏడాది కాలంలో ప్రజలు అనేక సార్లు కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఒక్క జర్మనీలోనే కాకుండా యూరప్‌లోని ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ వంటి దేశాల్లోనూ కరోనా ఆంక్షలను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. 

Updated Date - 2021-03-21T05:36:30+05:30 IST