18 దేశాల్లోని ఈ 50 నగరాలకు భారతీయులు వెళ్లొచ్చు..

ABN , First Publish Date - 2021-09-09T15:53:20+05:30 IST

కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, 18 దేశాలతో కొనసాగుతున్న ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా ఆయా దేశాల్లోని సుమారు 50 నగరాలకు భారతీయులు వెళ్లొచ్చు. ఈ జాబితాలో యూకే, కెన్యా, భూటాన్...

18 దేశాల్లోని ఈ 50 నగరాలకు భారతీయులు వెళ్లొచ్చు..

ఇంటర్నెట్ డెస్క్: కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, 18 దేశాలతో కొనసాగుతున్న ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా ఆయా దేశాల్లోని సుమారు 50 నగరాలకు భారతీయులు వెళ్లొచ్చు. ఈ జాబితాలో యునైటెడ్ కింగ్‌డమ్(యూకే), కెన్యా, భూటాన్, ఫ్రాన్స్, అమెరికా, యూఏఈ, కువైత్, కెనడా తదితర దేశాలు ఉన్నాయి. కనుక మీరు ఒకవేళ విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉంటే భారత ప్రభుత్వం ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా స్పెషల్ విమానాలు నడిపిస్తున్న నగరాల జాబితాను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఆయా నగరాలకు నడుస్తున్న ప్రత్యేక విమానాల టికెట్ బుకింగ్ కోసం ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, ఎయిర్ ఇండియా కార్యాలయాలు, ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించవచ్చు. 


సెప్టెంబర్‌లో భారతీయ ప్రయాణికులు వెళ్లేందుకు వీలున్న ఎయిర్ బబుల్ జాబితాలోని దేశాల్లోని నగరాల వివరాలను ఒకసారి పరిశీలిస్తే... 

కెనడా- టొరంటో, వాంకోవర్

బంగ్లాదేశ్- ఢాకా

ఆఫ్ఘనిస్థాన్- కాబూల్

బహ్రెయిన్- బహ్రెయిన్

జర్మనీ- ఫ్రాంక్‌ఫర్ట్

జపాన్- నరితా

రష్యా- మాస్కో

ఫ్రాన్స్- పారిస్

శ్రీలంక- కొలంబో

యూకే- లండన్, బర్మింగ్‌హాం

నేపాల్- ఖట్మాండు

కెన్యా- నైరుబీ

కువైత్- కువైత్

యూఏఈ- దుబాయ్, అబుధాబి

అమెరికా- చికాగో, వాషింగ్టన్, నెవార్క్, శాన్‌ ఫ్రాన్సిస్కో

మాల్దీవులు- మాలే

ఒమన్- మస్కట్


ఇవి కూడా చదవండి..

NEET Exam కు హాజరయ్యే విద్యార్థులకు కువైత్‌లోని Indian Embassy కీలక సూచనలు..

Income Tax కట్టనంటూ అడ్డం తిరిగిన NRI.. మొత్తానికి సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..ఎయిర్ ఇండియా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 30 వరకు ఈ నగరాలకు వెళ్లే విమానాల షెడ్యూల్‌ను రూపొందించడం జరిగింది. అయితే, కరోనా నేపథ్యంలో ఈ షెడ్యూల్‌లో మార్పులు ఉండొచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాల్సిందిగా కోరారు. ఇక బంగ్లాదేశ్‌తో కొనసాగుతున్న ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా సెప్టెంబర్ 3 నుంచి ఎయిర్ ఇండియా విమానాలను ప్రారంభించింది. ఎయిర్ ఇండియాతో పాటు మరో విమాన సంస్థ కూడా బంగ్లాకు విమాన సర్వీసులు నడిపిస్తోంది. అలాగే సెప్టెంబర్ 7 నుంచి కెనడా కూడా భారతీయ ప్రయాణికుల ఎంట్రీకి అనుమతి ఇచ్చింది. అయితే, ప్రయాణికులు టీకా వేసుకోవడం(కేవలం కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే) తప్పనిసరి. దీంతోపాటు జర్నీకి 72 గంటల ముందు తీసుకున్న ఆర్‌టీపీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాలి.  


అటు యూఏఈలోని దుబాయ్, అబుధాబి నగరాలు కూడా భారతీయుల రాకపై నిషేధాన్ని తొలగించాయి. కాకపోతే కొన్ని కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి. అలాగే కువైత్ కూడా ఈ నెల 7 నుంచి భారత్‌కు డైరెక్ట్ విమానాలు నడిపిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రయాణికులు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదించిన కరోనా వ్యాక్సిన్‌లలో ఏదో ఒకటి తీసుకుని ఉండాలి. దీంతోపాటు ప్రయాణానికి 48 గంటల ముందు ప్రభుత్వ గుర్తింపు పొందిన లాబొరేటరీ నుంచి తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుంది. బహ్రెయిన్ సైతం భారత ప్రయాణికుల ప్రవేశానికి అనుమతి ఇచ్చిందని అక్కడి ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. జర్నీకి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్టు సర్టిఫికేట్‌తో పాటు అక్కడికి చేరుకున్న తర్వాత మళ్లీ పీసీఆర్ టెస్టు, క్వారంటైన్ ఇతర కొన్ని నిబంధనలు విధించింది.  Updated Date - 2021-09-09T15:53:20+05:30 IST