ప్రాంక్ చేద్దామనుకుని ప్రాణాలు పొగొట్టుకున్న యూట్యూబర్.. అమెరికాలో..

ABN , First Publish Date - 2021-02-09T00:12:07+05:30 IST

అమెరికాలో ఓ యూట్యూబర్ ప్రాంక్ చేయాలని ప్రయత్నించి వేరే వ్యక్తి చేతిలో తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

ప్రాంక్ చేద్దామనుకుని ప్రాణాలు పొగొట్టుకున్న యూట్యూబర్.. అమెరికాలో..

నాష్‌విల్లే: అమెరికాలో ఓ యూట్యూబర్ ప్రాంక్ చేయాలని ప్రయత్నించి వేరే వ్యక్తి చేతిలో తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లేలో గత శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టిమాతీ విల్క్స్(20) అనే యూట్యూబర్, తన స్నేహితుడు ప్రాంక్ చేయాలనుకుని, చేతిలో కత్తి పెట్టుకుని ఓ గుంపు వద్దకు వెళ్లారు. దోపిడీదారుల్లా వారిద్దరూ నటించడంతో గుంపులో ఉన్న డేవిడ్ స్టార్న్స్(23) అనే యువకుడు వెంటనే తుపాకీని బయటకు తీసి టిమాతీని కాల్చాడు.


డేవిడ్ తుపాకీతో కాల్చడంతో టిమాతీ అక్కడికక్కడే మృతిచెందాడు. తాము చేస్తోంది ప్రాంక్ వీడియో అంటూ టిమాతీ స్నేహితుడు వారికి చెప్పడంతో అంతా షాకయ్యారు. అనంతరం అక్కడకు పోలీసులు చేరుకోగా.. తాను ఆత్మరక్షణ కోసమే టిమాతీని తుపాకీతో కాల్చానని డేవిడ్ వివరించాడు. దీంతో అధికారులు డేవిడ్‌పై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. తాము ఈ కేసుపై మరింత దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  

Updated Date - 2021-02-09T00:12:07+05:30 IST