ట్రంప్‌కు ట్విటర్ ఇచ్చిన భారీ షాక్ వెనుక తెలుగమ్మాయి!
ABN , First Publish Date - 2021-01-12T13:11:25+05:30 IST
అమెరికా అధ్యక్షుడిగా గద్దె దిగనున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్‌కు ట్విటర్ ఇచ్చిన భారీ షాక్ వెనుక ఓ తెలుగు అమ్మాయి ఉందన్న సంగతి మీకు తెలుసా? ట్రంప్ వ్యక్తిగత ఖాతాతో పాటు ‘టీం ట్రంప్’ అనే ఖాతాను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ‘ప్రెసిడెంట్ ట్రంప్’ ప్రభుత్వ ఖాతా కావడంతో దానిని నిషేధించకున్నప్పటికీ.. అందులోని వివాదాస్పద ట్వీట్లను మాత్రం తొలగించారు.

ట్విటర్ ఖాతాల రద్దు వెనుక విజయ గద్దె..
ఆ సంస్థ లీగల్ హెడ్‌గా కీలక నిర్ణయం
వాషింగ్టన్, జనవరి 11 : అమెరికా అధ్యక్షుడిగా గద్దె దిగనున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్‌కు ట్విటర్ ఇచ్చిన భారీ షాక్ వెనుక ఓ తెలుగు అమ్మాయి ఉందన్న సంగతి మీకు తెలుసా? ట్రంప్ వ్యక్తిగత ఖాతాతో పాటు ‘టీం ట్రంప్’ అనే ఖాతాను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ‘ప్రెసిడెంట్ ట్రంప్’ ప్రభుత్వ ఖాతా కావడంతో దానిని నిషేధించకున్నప్పటికీ.. అందులోని వివాదాస్పద ట్వీట్లను మాత్రం తొలగించారు. ట్విటర్ లీగల్ హెడ్‌గా భారత సంతతికి చెందిన విజయ గద్దె ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడం విశేషం. ‘మరిన్ని హింసాత్మక సంఘటనలు జరగకుండా ట్రంప్ ఖాతాలను శాశ్వతంగా రద్దు చేశాం.
మా నిర్ణయాల అమలుకు సంబంధించిన విధాన విశ్లేషణను మీకిక్కడ అందుబాటులో ఉంచాం. తద్వారా ట్రంప్ ఖాతాల రద్దు వెనుక నిర్ణయాల గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు’ అని ఆమె ట్వీట్ చేశారు. విజయ గద్దె హైదరాబాద్‌లో జన్మించారు. చిన్నతనంలోనే ఆమె కుటుంబం అమెరికాలోని టెక్స్‌సకు వలసవెళ్లింది. కార్నెల్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టాను, న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. సోషల్‌మీడియా దిగ్గజం ట్విటర్లో 2011లో చేరారు.