ఆస్ట్రేలియాలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి!
ABN , First Publish Date - 2021-02-28T13:12:34+05:30 IST
ఆస్ట్రేలియాలో ఆంధ్రకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావి హరీశ్‌బాబు(34) ఏడేళ్ల నుంచి ఆస్ర్టేలియాలోని ఆడిలైడ్ రాష్ట్రం.. శాలి్సబరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
మేదరమెట్ల: ఆస్ట్రేలియాలో ఆంధ్రకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావి హరీశ్‌బాబు(34) ఏడేళ్ల నుంచి ఆస్ర్టేలియాలోని ఆడిలైడ్ రాష్ట్రం.. శాలి్సబరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య, బాబు ఉన్నాడు. కొంతకాలంగా కొడుకుతో ఇండియాలో ఉంటున్న భార్య ఆస్ట్రేలియా వెళ్లేందుకు శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. భర్తకు ఫోన్ చేయగా ఆయన లిఫ్ట్ చేయలేదు. దీంతో హరీశ్ స్నేహితులను సంప్రదించారు. వారు హరీశ్ ఇంటికి వెళ్లి చూడగా హరీశ్‌బాబు మంచంపై విగతజీవిగా పడి ఉన్నారు.