అమెరికా రోడ్డు ప్రమాదంలో సైదాబాద్‌ వాసి మృతి

ABN , First Publish Date - 2021-05-30T19:09:21+05:30 IST

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాబాద్‌ లక్ష్మినగర్‌ కాలనీకి చెందిన కీసరి శివారెడ్డి (45) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అమెరికా రోడ్డు ప్రమాదంలో సైదాబాద్‌ వాసి మృతి

సైదాబాద్‌ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాబాద్‌ లక్ష్మినగర్‌ కాలనీకి చెందిన కీసరి శివారెడ్డి (45) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవిహితుడైన శివారెడ్డి 22 ఏళ్ల క్రితం ఆమెరికా వెళ్లి ఓహియో సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 16న రాత్రి కారులో ప్రయాణిస్తూ చెట్టును ఢీకొట్లాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఉదయం గమనించిన యూఎస్‌ పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం శివారెడ్డి మృతదేహం నగరానికి చేరుకుంది. సాయంత్రం సైదాబాద్‌ దోభీఘాట్‌లోని శ్మశానవాటికలో అంత్య‌క్రియ‌లు నిర్వహించారు.

Updated Date - 2021-05-30T19:09:21+05:30 IST