దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు ఆధ్వర్యంలో 'తెలుగు భాషా దినోత్సవం-2021'
ABN , First Publish Date - 2021-08-28T21:04:27+05:30 IST
"వీధి అరుగు- నార్వే", "దక్షిణాఫ్రికా తెలుగు సంఘం" సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 'తెలుగు భాషా దినోత్సవం-2021' ఆగస్టు 28(శనివారం), ఆగస్టు 29(ఆదివారం) రెండు రోజుల పాటు ఘనంగా జరగనుంది.
"వీధి అరుగు- నార్వే", "దక్షిణాఫ్రికా తెలుగు సంఘం" సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 'తెలుగు భాషా దినోత్సవం-2021' ఆగస్టు 28(శనివారం), ఆగస్టు 29(ఆదివారం) రెండు రోజుల పాటు ఘనంగా జరగనుంది. తెలుగు భాష సాహిత్య సంస్కృతులకు పట్టం కడుతూ, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలోని 75కు పైగా తెలుగు సంస్థల సమన్వయంతో తెలుగువారందరూ కలిసి జరుపుకునేలా ఇవాళ(శనివారం) ఈ అంతర్జాతీయ వేడుకలు అంతర్జాలం వేదికగా ప్రారంభం అవుతున్నాయి. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి యన్.వి రమణ విచ్చేయనున్నారు.
కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో లైవ్‌లో వీక్షించుటకు..
YouTube Live: https://youtube.com/embed/ahjiJ6XvLB8
Facebook Live: https://www.facebook.com/SATELUGUCOMMUNITY