సింగపూర్‌లో టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2021-03-22T19:10:15+05:30 IST

సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. హెల్త్ అండ్ సైన్స్ అథారిటీ సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విశేష స్పందిన లభించిం

సింగపూర్‌లో టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

సింగపూర్ సిటీ: సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. హెల్త్ అండ్ సైన్స్ అథారిటీ సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విశేష స్పందిన లభించిందని సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్ అన్నారు. సుమారు 50 మంది దాతలు ముందుకొచ్చి.. రక్తదానం చేసినట్టు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వారికి సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సేవాకార్యక్రమాలను మరిన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు. సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయని అభిప్రాయపడ్డారు. గత 11ఏళ్లుగా ఏటా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కాగా.. కొవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడాన్ని హెల్త్ అండ్ సైన్స్ అథారిటీ సింగపూర్ అధికారులు అభినందించారు. లాభాపేక్ష లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీపై ప్రశంసలు కరిపించారు. ఈ కార్యక్రమానికి నంగునూరి వెంకట రమణ, గోనె నరేందర్, శశిధర్ రెడ్డి, శివ ప్రసాద్ ఆవుల సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఇందులో ప్రధాన కార్యదర్శి, బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్, సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-22T19:10:15+05:30 IST