ఇండియన్ డయాస్పుర సభ్యులను ప్రశంసించిన తరణ్జిత్ సింగ్ సంధూ!
ABN , First Publish Date - 2021-02-27T00:34:53+05:30 IST
అమెరికాలోని ఇండియన్ డయాస్పుర సభ్యులతో సంభాషించడంపట్ల అమెరికాలోని భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూ సంతోషం వ్యక్తం చేశారు. భారత్-అమెరికాల మధ్య ఉన్న సంబంధాలు మెరుగుపడ

వాషింగ్టన్: అమెరికాలోని ఇండియన్ డయాస్పుర సభ్యులతో సంభాషించడంపట్ల అమెరికాలోని భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూ సంతోషం వ్యక్తం చేశారు. భారత్-అమెరికాల మధ్య ఉన్న సంబంధాలు మెరుగుపడటంలో డయాస్పుర సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. వివరాల్లోకి వెళితే.. తరణ్జిత్ సింగ్ సంధూ తాజాగా ఇండియన్ డయాస్పుర సభ్యులతో వర్చువల్గా సమావేశమయ్యారు. భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు సహా ఇతర అంశాలపై ఆయన వారితో చర్చించారు. ఈ సమావేశం అనంతరం ట్విట్టర్ వేదికగా తరణ్జిత్ సింగ్ సంధూ స్పందించారు. ‘అమెరికా నలుమూలల నుండి వచ్చిన భారత ప్రవాసుల సభ్యులతో సంభాషించడం, భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో వారి విభిన్న దృక్పథాలను వినడం ఆనందాన్నిచ్చింది. అమెరికాలోని శక్తివంతమైన భారతీయ అమెరికన్ సమాజం.. ఇరు దేశాల మధ్య కీలక పాత్ర పోషిస్తోంది’ అని పేర్కొన్నారు.