తానా ఆధ్వర్యంలో ‘భక్త పోతన సాహిత్య వైభవం’ హరికథాగానం

ABN , First Publish Date - 2021-02-26T17:51:06+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న ‘భక్త పోతన సాహిత్య వైభవం’ అనే హరికథాగానం కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

తానా ఆధ్వర్యంలో ‘భక్త పోతన సాహిత్య వైభవం’ హరికథాగానం

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న ‘భక్త పోతన సాహిత్య వైభవం’ అనే హరికథాగానం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రతినెల ఆఖరి ఆదివారం నిర్వహించే అంతర్జాతీయ దృశ్య సమావేశంలో భాగంగా ఈ ఆదివారం ఈ 10వ సమావేశం నిర్వహిస్తోంది. వర్చువల్‌గా జరిగే ఈ హరికథాగానం కార్యక్రమం కథకులుగా తిరుపతికి చెందిన వాచస్పతి డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచలశాస్త్రి వ్యవహిరించనున్నారు. ఆయనకు లోళ్ల జయరాం(వాయులీనం), కోటిపల్లి రమేష్(మృదంగం) సహాకారం అందించనున్నట్టు తానా అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్, తాన ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర తెలిపారు. ఫిబ్రవరి 28న.. అంటే ఆదివారం రాత్రి 8.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారం మొదలవుతుంది. యూప్ టీవీలో తానా ప్రపంచసాహిత్య వేదిక టీవీ ఛానల్ ద్వారా ప్రత్యక్షప్రసారం ఉంటుంది. అలాగే టీవీ 5 యూఎస్ఏ, మన టీవీ, టీవీ ఏషియా తెలుగులో కూడా లైవ్ ఉంటది.

లైవ్ స్ట్రీమింగ్ కోసం ఫేస్‌బుక్: https://www.facebook.com/TANA.ORG

యూ ట్యూబ్: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw

ఇతర  వివరాల కోసం www.tana.orgలో చూడొచ్చు.      

Updated Date - 2021-02-26T17:51:06+05:30 IST