తానా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘లలిత సంగీత సాహిత్యం – తీరు తెన్నులు’పై చర్చ!

ABN , First Publish Date - 2021-03-24T21:01:34+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం రోజున సాహిత్య కార్యక్రమాలు గతకొద్ది రోజులుగా జరుగుతున్న విషయం తెలి

తానా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘లలిత సంగీత సాహిత్యం – తీరు తెన్నులు’పై చర్చ!

వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం రోజున సాహిత్య కార్యక్రమాలు గతకొద్ది రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈనెల 28న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 8.30గంటలకు (అమెరికాలో ఉదయం 8 గంటలకు) ‘లలిత సంగీత సాహిత్యం – తీరు తెన్నులు’ అనే అంశంపై సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తానా ప్రకటించింది. ఈ అంశంపై ప్రఖ్యాత గాయని.. శ్వేత కోకిల వేదపతి ప్రభాకర్, ప్రముఖ కవులు ఎం.కె. రాము, వోలేటి పార్వతీశం, ప్రసిద్ధ సినీ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ, ప్రముఖ స్వరకర్త కలగ కృష్ణమోహన్, ప్రముఖ రచయిత్రి వారణాసి నాగలక్ష్మి, సినీ నేపధ్య గాయకులు కొమండూరి రామాచారి తదితరలు ప్రసంగిస్తారని తెలిపింది. గురు కొమండూరి రామాచారి నిర్వహణలో గాయనీ గాయకులు.. లలిత గీతాలాపన చేస్తారని పేర్కొంది. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనొచ్చని వెల్లడించింది. తానాకు సంబంధించిన సోషల్ మీడియా వేదికల ద్వారా కార్యక్రమాన్ని వీక్షించొచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు www.tana.org ని సందర్శించాలని కోరింది. 


ఈ కింది లింక్‌ల ద్వారా కార్యక్రమంలో పాల్గొనవచ్చు

Facebook: https://www.facebook.com/tana.org

YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
Updated Date - 2021-03-24T21:01:34+05:30 IST