తానా 2021 ఎన్నికలు.. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా!

ABN , First Publish Date - 2021-03-14T21:43:35+05:30 IST

TANA 2021 Elections List of Contesting Candidates

తానా 2021 ఎన్నికలు.. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా!

వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల పర్వం, ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. కొన్ని పదవులకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా.. మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వివిధ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను తానా ప్రకటించింది. బోర్డ్ డైరెక్టర్ (నాన్ డోనర్స్) రెండు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. వీటికి గుడిసేవ విజయ్, నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, జనార్థన్ నిమ్మిల పూడి, రవి పొట్లూరి ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికైన అభ్యర్థలు నాలుగేళ్లపాటు (2021-2025) ఈ పదవిలో కొనసాగుతారు. 


ఎగ్జిక్యూటివ్ కమిటీ‌‌లో స్థానం దక్కించుకోవడం కోసం పోటీ పడుతున్న వారి వివరాలను పరిశీలిస్తే..

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి శ్రీనివాస రావు గోగినేని, నారేన్ కొడాలి, నిరంజన్ శృంగవరపు పోటీ చేస్తున్నారు. అశోక్ బాబు కొల్లా, జగదీశ్ కే ప్రభాల ట్రేజరర్ పదవి కోసం తలపడుతున్నారు. జాయింట్ సెక్రటరీ‌ పదవి కోసం వెంకట్ కోగంటి, మురళి తాళ్లూరి ఎన్నికల బరిలో నిలిచారు. జాయింట్ ట్రెజరర్ పదవికి భరత్ మద్దినేని, సునీల్ పంట్రా పోటీ చేస్తున్నారు. కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి రజనీకాంత్ కాకర్ల, వెంకట కాసుకుర్తి పోటీ పడుతున్నారు. కల్చరల్ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి సతీష్ తుమ్మల, శిరీష తునుగుంట్ల పోటీ చేస్తున్నారు. ఉమెన్ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి చాందిని దువ్వూరి, ఉమా ఆర్ కాటికి తలపడుతున్నారు. 


స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ పదవికి; 

అనీల్ చౌదరీ ఉప్పలపాటి, శశాంక్ యార్లగడ్డ

రీజనల్ రిప్రజంటేటివ్ -న్యూ ఇంగ్లాండ్;

ప్రదీప్ కుమార్ గడ్డమ్, రావు యలమంచి

రీజనల్ రిప్రజెంటేటివ్-న్యూ జెర్సీ;

శ్రీ పద్మలక్ష్మా అద్దంకి, వంశీ కృష్ణ వసిరెడ్డి

రీజనల్ రిప్రజెంటేటివ్- మిడిల్ అట్లాంటిక్;

శశిధర్ జాస్తి, సునీల్ కుమార్ కోగంటి

రీజనల్ రిప్రజెంటేటివ్-మిడ్ వెస్ట్;

హనుమంతరావు చురుకూరి, శ్రీధర్ కుమార్ కొమ్మలపాటి

రీజనల్ రిప్రజెంటేటివ్-డీఎఫ్‌డబ్ల్యూ;

సతీశ్ కొమ్మన, దినేశ్ త్రిపురనేని

రీజనల్ రిప్రజెంటేటివ్-నార్త్ సెంట్రల్;

సాయి బొల్లినేని, శ్రీమన్నారయన యార్లగడ్డ పోటీ చేస్తున్నారు. 

ఈ వీటికి ఎన్నికైన వారు రెండేళ్ల (2021-2023) వరకు పదవిలో కొనసాగుతారు. 



ఫౌండేషన్ ట్రస్టీ (నాన్ డోనర్స్)లోని ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. కిరణ్ గోగినేని, పురుషోత్తమ చౌదరి, వినయ్ కుమార్ మద్దినేని, రవి కుమార్ మండలపు, సత్యనారాయణ వీ మన్నె, శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీకాంత్ పోలవరపు, రాజా సురపనేని, వరప్రసాద్ యాదన, శ్రీనివాస్ ఆర్ ఎండూరి ఎన్నికల బరిలో నిలిచారు. 


ఫౌండేషన్ ట్రస్టీ (డోనర్స్)కి సంబంధించి 2 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కిరణ్ అమిరినేని, విద్యాధర్ గరపాటి, ప్రసాద్ రావు నల్లూరి, ససికాంత్ వల్లిపల్లి పోటీ చేస్తున్నారు. ఎన్నికైన వారు నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు. కాగా.. బ్యాలెట్ స్వీకరణకు ఎన్నికల కమిటీ తుది గడువు మే 14గా నిర్ణయించింది. ఎన్నికల ఫలితాలు మే 16న ప్రకటిస్తుంది. 


Updated Date - 2021-03-14T21:43:35+05:30 IST