కొలంబస్‌లో పర్యటించిన కొడాలి నరేన్!

ABN , First Publish Date - 2021-03-14T23:06:06+05:30 IST

తానా 2021 ఎన్నికలు మేలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న కొడాలి నరేన్ విస్తృతంగా పర్యటిస్తూ మద్దతు కోరుతున్నారు. శనివారం సాయంత్రం కొలంబస్‌లో

కొలంబస్‌లో పర్యటించిన కొడాలి నరేన్!

వాషింగ్టన్: తానా 2021 ఎన్నికలు మేలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న కొడాలి నరేన్ విస్తృతంగా పర్యటిస్తూ మద్దతు కోరుతున్నారు. శనివారం సాయంత్రం కొలంబస్‌లో కొడాలి నరేన్ ప్యానెల్ పర్యటించింది. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసులతో కొడాలి నరేన్ మాట్లాడారు. అందరినీ కలుపుకొనిపోతూ.. ఆశావహ దృక్పథంతో ముందడుగు వేయడమే తమ విజయ రహస్యమని వ్యాక్యానించారు. సమస్యలు ఎదురైతే దాన్ని పరిష్కరించే మార్గాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరగాలన్నారు. తద్వారా సంస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని నరేన్ అభిప్రాయపడ్డారు. తనకు అవకాశం కల్పిస్తే ఇటువంటి విధానాలకు పెద్దపీట వేయనున్నట్టు చెప్పారు. కాగా.. ఈ కార్యక్రమంలో 150 మందికిపైగా ప్రవాసులు హాజరయ్యారు. 


Updated Date - 2021-03-14T23:06:06+05:30 IST