లాస్ ఏంజిల్స్ విశ్వ వేదికపై మాయబజార్ పౌరాణిక నాటకం

ABN , First Publish Date - 2021-02-06T19:27:26+05:30 IST

విశ్వవేదిక లాస్ ఏంజి‌ల్స్‌లో సురభి సంస్థ ఇవాళ(శనివారం) సాయంత్రం 6 గంటలకు "మాయబజార్" పౌరాణిక నాటక ప్రదర్శన ఇస్తోంది.

లాస్ ఏంజిల్స్ విశ్వ వేదికపై మాయబజార్ పౌరాణిక నాటకం

విశ్వవేదిక లాస్ ఏంజి‌ల్స్‌లో సురభి సంస్థ ఇవాళ(శనివారం) సాయంత్రం 6 గంటలకు "మాయబజార్" పౌరాణిక నాటక ప్రదర్శన ఇస్తోంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్), దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం(టాస్క్) సంయుక్త ఆధ్వర్యంలో పురాణ కల ఆధారంగా ఆనాటి సమాజంలో నైతిక విలువలు, మానవ సంబంధాలపై పౌరాణిక నాటకాలతో అవగాహన కలిగించిన 135 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక నాటక సంస్థ సురభి ఈ పౌరాణికి నాటక ప్రదర్శన చేస్తుండడం విశేషం. సురభి డ్రామా థియేటర్‌- సురభి జయానంద్‌ గ్రూప్‌ వారి పౌరాణిక నాటక ప్రదర్శన మాయా బజార్‌ లాస్ఏంజి‌ల్స్‌లో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా సుప్రసిద్ధ రచయిత, సినీ నటులు తనికెళ్ల భరణి హాజరు కానున్నారు. 


ఇక పౌరాణిక నాటకాల ఆధారంగా జీవిస్తున్న 60 కుటుంబాలకు తమ వంతు చేయూతనందించడటానికి చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరు సహకారం అందించి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని యువ తరాలకు పరిచయం చేయడమే కాకుండా, నాటకాలకు తమ జీవితాలను అంకితం చేసి స్టేజ్‌ షోలపై ఆధారపడిన 60 కుటుంబాలకు మద్దతు ఇస్తుందన్నారు. కరోనా వేళ పని లభించకపోవడం వల్ల కళాకారులు కష్టాలను ఎదుర్కొంటున్నందున వారికి గతంలో కంటే ఇప్పుడు మన అవసరం ఉందన్నారు. 


వివిధ సామాజిక మాధ్యమాల్లో వీక్షించడానికి లింకులివే..

నాట్స్ యూట్యూబ్ ఛానెల్: www.natsworld.org/youtubelive

టాస్క్ యూట్యూబ్ ఛానెల్: youtube.com/c/TASCLive/live

టాస్క్ ఫేస్‌బుక్ పేజీ: fb.com/TASCPageUpdated Date - 2021-02-06T19:27:26+05:30 IST