ఎయిర్‌పోర్టులో వెలుగు చూసిన స్కాం.. కరోనా టెస్టుకోసం సెకండ్ హ్యాండ్ స్వాబ్స్!

ABN , First Publish Date - 2021-05-06T05:12:36+05:30 IST

అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించే ఒక భయంకరమైన స్కాం ఇండోనేషియాలో వెలుగు చూసింది. ఇక్కడి కౌలాన్మను ఎయిర్‌పోర్టులో ఈ కుంభకోణం జరిగింది.

ఎయిర్‌పోర్టులో వెలుగు చూసిన స్కాం.. కరోనా టెస్టుకోసం సెకండ్ హ్యాండ్ స్వాబ్స్!

ఇండోనేషియా: అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించే ఒక భయంకరమైన స్కాం ఇండోనేషియాలో వెలుగు చూసింది. ఇక్కడి కౌలాన్మను ఎయిర్‌పోర్టులో ఈ కుంభకోణం జరిగింది. ఇది దేశంలోని ఒక బిజీ ఎయిర్‌పోర్టు.. వచ్చే పోయే ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణలో ప్రయాణికులకు కరోనా టెస్టులు తప్పనిసని చేసింది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని ఉపయోగించుకొని కిమియా ఫార్మా అనే కంపెనీకి చెందిన ఉద్యోగులు ఓ కుంభకోణానికి తెరలేపారు. ప్రయాణికులకు కరోనా టెస్టులు చేసే నాజల్ స్వాబ్ కిట్లను మళ్లీ మళ్లీ వాడటం ప్రారంభించారు.


ఇవి ఎవరికి వారికే కొత్తవి వాడాలి. లేదంటే వారికి వైరస్ సోకిందీ లేనిదీ తెలుసుకోవడం కష్టం. కానీ ఈ ఫార్మా ఉద్యోగులు మాత్రం ఒకరికి ఉపయోగించిన స్వాబ్‌లను శుభ్రం చేసి వేరొకరికి పరీక్షలు చేశారు. ఇలా సుమారు 9వేల మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన తర్వాత కిమియా ఫార్మాకు చెందిన పలువురు ఉద్యోగస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణం గతేడాది డిసెంబరు నుంచి అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-05-06T05:12:36+05:30 IST