ఆ విషయంలో NRI లకు ముందస్తు అనుమతి అవసరం లేదు.. RBI కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-12-31T02:10:59+05:30 IST

న్నారైలు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు దారులు భారత్‌లో స్థిరాస్థి కొనుగోలు, బదిలికీ తమ ముందుస్తు అనుమతి తీసుకోనవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా పేర్కొంది. అయితే..వ్యవసాయ భూములు, ఫార్మ్ హౌస్‌లు, ప్లాటేషన్(తోటలు)లకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.

ఆ విషయంలో NRI లకు ముందస్తు అనుమతి అవసరం లేదు.. RBI కీలక ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు దారులు భారత్‌లో స్థిరాస్థి కొనుగోలు, బదిలికీ తమ ముందుస్తు అనుమతి తీసుకోనవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా పేర్కొంది. అయితే..వ్యవసాయ భూములు, ఫార్మ్ హౌస్‌లు, ప్లాటేషన్(తోటలు)లకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌కు సంబంధించి సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పలువురు ఓసీఐ కార్డు దారులు తమ సందేహాలను రిజర్వ్ బ్యాంకు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కేంద్రీయ బ్యాంకు బుధవారం సవివరమైన ప్రకటనను జారీ చేసింది. 

Updated Date - 2021-12-31T02:10:59+05:30 IST