అంతర్జాలం వేదికగా ఘనంగా రాయప్రోలు సుబ్బారావు జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-03-15T18:08:14+05:30 IST

నవ్యాంధ్ర సాహితీమూర్తి, ఆచార్య రాయప్రోలు సుబ్బారావు జయంతి సందర్భంగా ‘రాయప్రోలు సాహిత్య సౌందర్య దర్శనం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్

అంతర్జాలం వేదికగా ఘనంగా రాయప్రోలు సుబ్బారావు జయంతి వేడుకలు

సింగపూర్‌: నవ్యాంధ్ర సాహితీమూర్తి, ఆచార్య రాయప్రోలు సుబ్బారావు జయంతి సందర్భంగా ‘రాయప్రోలు సాహిత్య సౌందర్య దర్శనం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఇంటర్నెట్ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమంలో 15 దేశాల నుంచి 45 మంది అతిథులు పాల్గొన్నారు. రాయప్రోలు రచనలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా రాయప్రోలు సుబ్బారావు కుమారులు ప్రభాకర్‌, వారి కుటుంబ సభ్యులు రాయప్రోలు వారి చిత్ర పటానికి నివాళులర్పించారు.


ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా భారత్ నుంచి డాక్టర్‌ నందిని సిద్ధారెడ్డి, డాక్టర్‌ మండలి బుద్ధప్రసాద్, ఆచార్య కొలకలూరి ఇనాక్, డాక్టర్‌ వోలేటి పార్వతీశం, సినీ రచయిత భువనచంద్ర, డాక్టర్‌ కె.యాదగిరి, డాక్టర్‌ లావణ్య సరస్వతి, డాక్టర్‌ కసిరెడ్డి వెంకట్ రెడ్డి, డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఆచార్య కాత్యాయని విద్మహే, సినీనటి జమున, డాక్టర్‌ గంగిశెట్టి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.





అంతర్జాతీయ అతిథులుగా డాక్టర్‌ యల్లాప్రగడ రామకృష్ణారావు(ఆస్ట్రేలియా), జయ పీసపాటి(హాంకాంగ్‌), డాక్టర్‌.వెంకట ప్రతాప్, సత్య మల్లెల(మలేషియా), డాక్టర్‌. జొన్నలగెడ్డ మూర్తి(యూకే), ఆచార్య డేనియల్ నేజెర్స్(ఫ్రాన్స్), సీతారామరాజు(దక్షిణాఫ్రికా), సంజీవ నరసింహ అప్పుడు, నరేన్ స్వామి సన్యాసి(మారిషస్), చింతగుంట ఉదయపద్మ(యూఏఈ), తాతాజీ ఉసిరికల, డాక్టర్‌ వెంకట మాధవి లలిత, కాళిబాబు గంటి(ఖతార్), డాక్టర్‌ బూరుగుపల్లి వ్యాస కృష్ణ(ఉగాండా), వీర నరసింహ రాజు(కువైట్), డాక్టర్‌ శారదాపూర్ణ శొంటి, రత్నకుమార్ (రత్నపాప) రేవతి అదితం, రాయసం వెంకటరామయ్య, డాక్టర్‌ ప్రసాద్ తోటకూర, డాక్టర్‌ వంగూరు చిట్టెంరాజు(అమెరికా) పాల్గొని ప్రసంగించారు.


వంశీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు శిరోమణి వంశీ రామరాజు సభకు అధ్యక్షత వహించగా, రాధికా మంగిపూడి వ్యాఖ్యాత‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా ఎనిమిదిన్నర గంటల పాటు కొనసాగింది. అనంతరం ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సంస్థ తరఫున కవుటూరు రత్నకుమార్ సభకు అభినందనలు తెలిపారు.


Updated Date - 2021-03-15T18:08:14+05:30 IST