పనిచేస్తున్న క్యాసినోలోనే కన్నం వేసిన మహిళ.. దక్షిణ కొరియాలో..

ABN , First Publish Date - 2021-01-13T04:33:28+05:30 IST

క్యాసినోలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ఆచూకీ కోసం దక్షిణ కొరియా పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్యాసినోలో

పనిచేస్తున్న క్యాసినోలోనే కన్నం వేసిన మహిళ.. దక్షిణ కొరియాలో..

సియోల్: క్యాసినోలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ఆచూకీ కోసం దక్షిణ కొరియా పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్యాసినోలో 1.63 కోట్ల డాలర్లు(రూ. 95 కోట్లకు పైగా) మాయమైనట్టు యాజమాన్యం గుర్తించింది. ఈ పని ఉద్యోగులే చేసి ఉంటారని అనుమానించిన యాజమాన్యం ఉద్యోగుల వివరాలను తెలుసుకుంటూ వచ్చింది. ఒక మహిళా ఉద్యోగి వెకేషన్ అని చెప్పి సెలవులు తీసుకుని ఇప్పటివరకు రాలేదన్న విషయాన్ని గుర్తించింది. పైగా దొంగతనానికి గురైన సమయానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా మాయం కావడంతో కచ్చితంగా మహిళే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటుందని క్యాసినో యాజమాన్యం, పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆచూకీని కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

Updated Date - 2021-01-13T04:33:28+05:30 IST