కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు.. దుబాయిలోకి ఎంటర్ అవ్వొచ్చా?

ABN , First Publish Date - 2021-06-21T16:26:08+05:30 IST

భారత ప్రయాణికులకు దుబాయి తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. ప్రయాణ ఆంక్షలను సడలించింది. అంతేకాకుండా దుబాయికి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా తాము అనుమతించిన టీకాను తీసుకుని ఉం

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు.. దుబాయిలోకి ఎంటర్ అవ్వొచ్చా?

దుబాయి: భారత ప్రయాణికులకు దుబాయి తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. ప్రయాణ ఆంక్షలను సడలించింది.  అంతేకాకుండా దుబాయికి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా తాము అనుమతించిన టీకాను తీసుకుని ఉండాలని అధికారులు షరతు విధించారు. కాగా.. ఫైజర్, సైనోఫామ్, స్పుత్నిక్-వీ, ఆస్ట్రాజెనికా టీకాలను మాత్రమే యూఏఈ ఆమోదించింది. ఈ క్రమంలో.. ఇండియాలో కొవిషీల్డ్ పేరుతో ఉన్న ఆస్ట్రాజెనికా టీకాను పొందిన ప్రవాసులు సందేహాలు వ్యక్తం చేశారు. కొవిషీల్డ్ టీకా పొందిన వారికి దుబాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. లేదా అనే సందేహాలను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో దుబాయి హెల్త్ అథారిటీ (డీహెచ్ఏ) స్పందించింది. కోవిషీల్డ్, ఆస్ట్రాజెనికా టీకాలు వేరువేరు కాదని వెల్లడించింది. ఈ కోవిషీల్డ్‌ను ఆస్ట్రాజెనికాగానే పరిగణిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇండియాలో కోవిషీల్డ్ టీకా పొందిన యూఏఈ నివాసితులను దుబాయిలోకి అనుమతిస్తామని పేర్కొంది.  


Updated Date - 2021-06-21T16:26:08+05:30 IST