-
-
Home » NRI » Overseas Cinema » vakeel saab release locations in usa
-
యూఎస్‌లోని పవన్ అభిమానులకు పండగలాంటి వార్త!
ABN , First Publish Date - 2021-04-03T01:06:25+05:30 IST
అమెరికాలోని పవన్ అభిమానులకు వకీల్‌సాబ్ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పండగలాంటి వార్త చెప్పింది. వకీల్‌సాబ్ సినిమాను ప్రపచం వ్యాప్తంగా విడుదల చేయడానికి ఇప్పటికే సన్నాహాలను ప్రా

హైదరాబాద్: అమెరికాలోని పవన్ అభిమానులకు వకీల్‌సాబ్ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పండగలాంటి వార్త చెప్పింది. వకీల్‌సాబ్ సినిమాను ప్రపచం వ్యాప్తంగా విడుదల చేయడానికి ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించిన చిత్ర యూనిట్.. తాజాగా కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ నెల 8న వకీల్‌సాబ్ మూవీని కేవలం ఒక్క అమెరికాలోనే 265 లోకషన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. పవర్ స్టార్.. పవన్ కల్యాణ్ రాజకీయాల కారణంగా దాదాపు మూడేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు వకీల్‌సాబ్ మూవీ ద్వారా పవర్ స్టార్.. వెండితెరపై కనిపించనున్నారు. ఈ క్రమంలో పవన్ అభిమానులతోపాటు సినీ అభిమానులు కూడా వకీల్‌సాబ్‌ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌వైడ్‌గా వకీల్‌సాబ్ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా వకీల్‌సాబ్ మూవీ ఈ నెల 9న విడుదల అవుతుండగా.. అమెరికాలో మాత్రం ఒకరోజు ముందుగానే అంటే ఏప్రిల్ 8నే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూఎస్‌లో వకీల్‌సాబ్ మూవీ రిలీజ్ అవుతున్న లొకేషన్ల వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించింది.