యూఏఈలోని పవన్ అభిమానులకు గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2021-03-29T17:03:54+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జనసేన పార్టీని స్థాపించడంతో సినిమాలకు దూరమైన పవర్ స్టార్.. దాదాపు మూడేళ్ల తెర వకీల్‌ సాబ్ సిని

యూఏఈలోని పవన్ అభిమానులకు గుడ్‌న్యూస్!

అబుధాబి: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జనసేన పార్టీని స్థాపించడంతో సినిమాలకు దూరమైన పవర్ స్టార్.. దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్‌ సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ క్రమంలో యూఏఈలో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు తాజాగా ‌గుడ్‌న్యూస్ చెప్పింది.!


వకీల్‌ సాబ్ రిలీజ్ డేట్‌ను ఇవాళ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఏఈలో కూడా వకీల్‌ సాబ్ సినిమాను ఏప్రిల్ 9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అంటే ఇక్కడ.. అక్కడే ఒకటే రోజునే రిలీజ్ కాబోతోందన్న మాట. కాగా.. అమితాబచ్చన్ నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా వకీల్‌సాబ్ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా.. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. వకీల్‌సాబ్ చిత్రంలో అంజలి, నివేద థామస్, అనన్య నాగెళ్ల, ప్రకాశ్ రాజు తదితర నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-03-29T17:03:54+05:30 IST