రిలీజ్‌కు రెండు వారాల ముందే RRR టికెట్ల బుకింగ్.. అక్కడ ఇప్పటికే ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయంటే..

ABN , First Publish Date - 2021-12-20T00:20:58+05:30 IST

బహుబలితో పాన్ ఇండియా హిట్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి నుంచి వస్తున్న తరువాతి సినిమా ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే ఏడాది జనవరి 7న దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రిలీజ్‌కు రెండు వారాల ముందే RRR టికెట్ల బుకింగ్.. అక్కడ ఇప్పటికే ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయంటే..

ఇంటర్నెట్ డెస్క్: బహుబలితో పాన్ ఇండియా హిట్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి నుంచి వస్తున్న తరువాతి  సినిమా ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే ఏడాది జనవరి 7న దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు! యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన ట్రైలర్ ఇది. ఇక భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు అధికంగా ఉన్న అమెరికాలో కూడా సినిమా రిలీజ్ అవుతోంది. అయితే.. విడుదలకు మునుపే ఆర్ఆర్ఆర్ అమెరికాలో సరికొత్త రికార్డు సృష్టించింది.


 మరే ఇతర సినిమా విషయంలోనూ చూడని విధరంగా మూవీ మూకేర్స్..సినిమా రిలీజ్‌కు రెండు వారాల మునుపే ప్రీ బుక్సింగ్స్ ప్రారంభించారు. ఇప్పటికే టెక్కెట్లన్నీ అమ్ముడుపోవడంతో దాదాపు రెండు మిలియన్ డాలర్లు( మన కరెన్సీలో దాదాపు రూ.15 కోట్లు) వచ్చినట్టు తెలిసింది. బుకింగ్స్ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే ఈ మొత్తం సమకూరడం ఓ రికార్డని సినీ పండితుల అభిప్రాయం. ఇప్పుడే కలెక్షన్స్ ఈ స్థాయిలో ఉంటే.. ఇక సినిమా విడుదలయ్యాక పరిస్థితి ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చనే కామెంట్లు కూడా వినబడుతున్నాయి. దీంతో.. ఆర్ఆర్ఆర్ సినిమా హైప్.. మరో రేంజ్‌కు వెళ్లిపోయింది. ఈ సినిమా కలెక్షన్స్ రూ. 1000 కోట్లు మార్కు దాటాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నాడట.  

Updated Date - 2021-12-20T00:20:58+05:30 IST