అమెరికాలో ఉల్లాసంగా రజనీకాంత్‌

ABN , First Publish Date - 2021-07-02T05:35:33+05:30 IST

వైద్య పరీక్షల నిమిత్తం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అమెరికాలో ఉంటున్నారు. అక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమైన మాయో క్లినిక్‌లో ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్లినిక్‌కు వెళ్ళి బయటకు వస్తున్న ఫొటో ఒకటి

అమెరికాలో ఉల్లాసంగా రజనీకాంత్‌

వాషింగ్టన్: వైద్య పరీక్షల నిమిత్తం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అమెరికాలో ఉంటున్నారు. అక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమైన మాయో క్లినిక్‌లో ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్లినిక్‌కు వెళ్ళి బయటకు వస్తున్న ఫొటో ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో విడుదలైంది. ఇప్పుడు ఆయన అమెరికాలోని తన స్నేహితులలో కలిసి మాట్లాడుతున్న ఫొటో బయటకు వచ్చింది. ఇది చూస్తే రజనీకాంత్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో ఆయనకు మాయో క్లినిక్‌లో జరిపిన వైద్య పరీక్షల ఫలితాలన్నీ భేషుగ్గా ఉన్నాయనీ, మరో ఐదేళ్ళపాటు ఎలాంటి పరీక్షలు అక్కర్లేదని వైద్యులు చెప్పినట్టు సమాచారం. 


దీంతో ఖుషీగా ఉన్న రజనీకాంత్‌... అమెరికా పర్యటనలో తమకు అతిథ్యమిచ్చిన తన స్నేహితులు, ఫ్యాన్స్‌తో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. ఓ ఇంటి బాల్కనీలో ముగ్గురు వ్యక్తులతో రజనీకాంత్‌ మాట్లాడుతుండగా, ఎవరో క్లిక్‌ మనిపించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ప్రస్తుతం రజనీకాంత్‌ వెంట ఆయన భార్య లత, పెద్ద కుమార్తె ఐశ్వర్య ఉన్నారు. రజనీకాంత్‌ జూలై నెల రెండో వారంలో చెన్నై తిరిగిరానున్నారు. కాగా, రజనీకాంత్‌ నటించిన అణ్ణాత్త చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read more